Chiranjeevi: వారం రోజులపాటు విశ్రాంతి!
ABN, First Publish Date - 2023-08-18T17:36:37+05:30
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కాలికి సర్జరీ అంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసింది. అయితే ఆయన మోకాలికి(Knee Wash) పదిరోజుల క్రితమే చిన్నపాటి సర్జరీ (అర్ర్థోస్కోపీ) జరిగింది. దాని కోసం ఆయన ఢిల్లీలో వెళ్తారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కాలికి సర్జరీ అంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసింది. అయితే ఆయన మోకాలికి(Knee Wash) పదిరోజుల క్రితమే చిన్నపాటి సర్జరీ (అర్ర్థోస్కోపీ) జరిగింది. దాని కోసం ఆయన ఢిల్లీలో వెళ్తారు. సర్జరీ అనంతరం పదిరోజులు విశ్రాంతి కావాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన బాగానే నడుస్తున్నారని, వారంలో హైదరాబాద్ చేరుకుంటారని సన్నిహితుల నుంచి సమాచారం.
తాజాగా ఆయన హీరోగా నటించిన ‘భోళా శంకర్’ (Bhola shankar) చిత్రం విడుదలై పరాజయం పాలైంది. తదుపరి ఆయన రెండు చిత్రాలు కమిట్ అయ్యారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని, ‘బింబిసారా’ చిత్ర దర్శకుడు వశిష్ఠతో ఓ సినిమా చేయనున్నారు. చిరంజీవి హైదరాబాద్ రాగానే కల్యాణ్ కృష్ణ సినిమా మొదలుపెడతారని సమాచారం. ఈ చిత్రానికి చిరు పెద్దకుమార్తె సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.