సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chiranjeevi: నీ రాక ఆనందంగానూ, గర్వంగానూ ఉంది!

ABN, First Publish Date - 2023-06-20T10:45:43+05:30

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తాత అయ్యారు. మెగా ఫ్యామిలీలో మూడో తరం అడుగిడింది. రామ్‌చరణ్‌, ఉపాసన పండండి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన కొణిదెల (Upasana blessed with baby girl) ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తాత అయ్యారు. మెగా ఫ్యామిలీలో మూడో తరం అడుగిడింది. రామ్‌చరణ్‌, ఉపాసన పండండి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన కొణిదెల (Upasana blessed with baby girl) ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు అపోలో వైద్యులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. మెగా వారసురాలు రాకతో చిరంజీవి ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. (Mega Family third Genaration Girl)మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం!

‘‘లిటిల్‌ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం. నీ రాక మమ్మల్ని, మెగా ఫ్యామిలీని ప్రేమించే కోట్లాదిమంది అభిమానుల్ని, రామ్‌చరణ్‌-ఉపాసన దంపతుల్ని ఆనంద పరచింది. మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్ చేసింనందుకు ఆనందంగానూ, గర్వంగానూ ఉంది’’ అని చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సోమవారం రాత్రి రామ్‌చరణ్‌, ఉపాసన, చిరంజీవి సురేఖ తదితరులు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. తెల్లవారుజామున ఉపాసన ప్రసవించారు. మెగా వారసురాలి రాకతో మెగా ఫ్యామిలీతోపాటు అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అపోలో ప్రాంగణమంతా అభిమానులతో సందడిగా మారంది.

Updated Date - 2023-06-20T12:46:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!