సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sreeja Konidela: కొత్త సంవత్సరంలో.. తన జీవితంలోని కొత్త వ్యక్తిని పరిచయం చేసిన శ్రీజ

ABN, First Publish Date - 2023-01-03T13:03:01+05:30

గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ (Sreeja) పేరు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

Sreeja Konidela
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ (Sreeja) పేరు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య శ్రీజ వ్యక్తిగత జీవితంపై రకరకాల న్యూస్ (News) హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా భర్త కల్యాణ్ దేవ్‌తో వైవాహిక జీవితంపై రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కొత్త సంవత్సరం సందర్భంగా సోషల్ మీడియాలో శ్రీజ షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ (Viral) అవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీజ ఓ వీడియోని షేర్ చేసింది. అందులో ‘డియర్ 2022, నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి కలిసేలా చేసినందుకు ధన్యవాదాలు. నా గురించి ఎక్కువగా తెలిసిన వ్యక్తిని, నన్ను ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించే వ్యక్తిని, నన్ను జాగ్రత్తగా చూసే వ్యక్తిని, ఎత్తుపల్లాల్లో నా వెనుక నిలబడే వ్యక్తి తను. డియర్ మీ, చివరికీ నిన్ను కలిసినందుకు అద్భుతంగా అనిపిస్తోంది. ప్రయాణం ప్రారంభమైంది’ అని రాసుకొచ్చింది. అంటే గత ఏడాది తను కలిసిన అద్భుతమైన వ్యక్తి స్వయంగా తానేనని శ్రీజ తెలిపింది. ఆ పోస్ట్‌కి.. ‘ప్రేమ, కరుణ, ఆనందం, జ్ఞానంతో 2023లోకి అడుగుపెడుతున్నాను’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది.

Updated Date - 2023-01-03T13:03:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!