Suma Latha: సుమలత కుమారుడి వివాహంలో చిరు దంపతులు!
ABN, First Publish Date - 2023-06-09T13:33:56+05:30
దివంగత నటుడు, అంబరీష్, సుమలత దంపతుల కుమారుడు అభిషేక్ వివాహం ఇటీవల బెంగుళూరులోని ఓ ప్యాలస్‌లో వైభవంగా జరిగింది.
దివంగత నటుడు, అంబరీష్, సుమలత (Suma latha) దంపతుల కుమారుడు అభిషేక్ వివాహం ఇటీవల బెంగుళూరులోని ఓ ప్యాలస్‌లో వైభవంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదపా కుమార్తె అవివాతో ఆయన వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆయన భార్య సురేఖ, బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్నసిన్హా ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే రజనీకాంత్, మోహన్‌బాబు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.