సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chiranjeevi Emotional: నువ్వు అందగాడివా.. ఇక నీ కలను మర్చిపో అన్నాడు!

ABN, First Publish Date - 2023-02-10T17:45:30+05:30

ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరి అండదండలు లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్‌ ఎదిగే క్రమంలో ఎన్నో ఇబ్బందులు, అంతకుమించి అవమానాలు ఎదుర్కొనట్లు చెప్పుకొచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరి అండదండలు లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్‌ ఎదిగే క్రమంలో ఎన్నో ఇబ్బందులు, అంతకుమించి అవమానాలు ఎదుర్కొనట్లు చెప్పుకొచ్చారు. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి తనది పూల బాట కాదని, ఎంతో కష్టం, చేసే పనిలో డెడికేషన్‌తో ముళ్ల బాటను పూల బాటగా మార్చుకుని మెగాస్టార్‌గా ఈ ేస్టజ్‌లోకి వచ్చానని తెలిపారు. పాప్‌ సింగర్‌ స్మిత (pop singer smitha) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ (Nijam show)కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్‌ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మద్రాస్‌లో అడుగుపెట్టిన కొత్తలో ఓ వ్యక్తి తనని చూసి.. ‘నువ్వేం అందగాడివి?’ (someone insulted chiranjeevi) అంటూ హేళన చేశాడని చిరు అన్నారు.

నటన మీదున్న ఆసక్తితో ఇండస్ర్టీలోకి రావాలలనే ఆశతో మద్రాస్‌కు వచ్చిన కొత్తలో ఓసారి పాండిబజార్‌కు వెళ్లాను. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి..‘‘ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోకి వచ్చావా? సినిమాల్లోకి ప్రయత్నిద్దామనేనా? అతడిని చూడు ఎంత అందంగా ఉన్నాడో.. అతడి కంటే నువ్వు అందగాడివా? ఇక్కడ తెలిసినవాళ్లు ఉంటేనే ఈజీగా రాగలవ్‌. లేదంటే కష్టమే! కాబట్టి నీ కలను మర్చిపో’’ అని హేళనగా మాట్లాడాడు. ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఇంటికి వెళ్లిపోయి ఇష్ట దైవం ముందు కూర్చొని.. ఇలాంటి వాటికి బెదరకూడదని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ఏడాదిపాటు పాండిబజార్‌ వైపు వెళ్లలేదు. ఇప్పుడు నన్ను విమర్శిస్తే అసలు పట్టించుకోను. చూసి నవ్వుకుంటాను. గుర్తింపు పొందడం కోసమే ఆ వ్యక్తి అలా మాట్లాడుతున్నాడని అనుకుంటా. అయితే స్టార్‌ స్టాటస్‌ తెచ్చుకునే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. మానసిక క్షోభకు గురైన సందర్భాలెన్నో. అయితే నా బాధను ఎవరితోనూ పంచుకోలేదు. అన్నింటికీ నాకు నేనే సమాధానం చెప్పుకొని మళ్లీ మామూలు మనిషిని అయ్యేవాడిని.

కోడి గుడ్లు విసిరారు..

‘‘ఒక స్టార్‌ హోదాలో ఉన్నప్పుడు ప్రశంసలే కాదు. విమర్శలు కూడా వస్తాయి. ‘ప్రజారాజ్యం’ స్థాపించి జగిత్యాలలో యాత్ర చేస్తోన్న సమయంలో అక్కడి ప్రజలు, అభిమానులు నాపై పూల వర్షం కురిపించారు. అదే సమయంలో కొంతమంది కోడి గుడ్లూ విసిరారు. నా మాటలు నచ్చకపోవడం వల్లే వాళ్లు ఇలా చేసి ఉండొచ్చు. ఇదే జీవితమంటే! విమర్శలు.. ప్రశంసలను సమానంగా తీసుకుని ముందుకు అడుగువేసినవాడే నాయకుడు. ఎక్కడైనా పొగడ్తలకు పొంగిపోకూడదు... విమర్శలకు కుంగిపోకూడదు’’ అని చిరంజీవి తెలిపారు.

Updated Date - 2023-02-10T17:55:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!