కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandramukhi 2 : లారెన్స్‌ తొలి పాన్‌ ఇండియా సినిమా సెన్సార్స్‌ పూర్తి!

ABN, First Publish Date - 2023-09-23T18:05:08+05:30

‘చంద్రముఖి’ చిత్రానికి కొనసాగింపుగా రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో ‘చంద్రముఖి 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! పి.వాసు దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.

‘చంద్రముఖి’ (Chandramukhi) చిత్రానికి కొనసాగింపుగా రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2)చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! పి.వాసు (P vasu) దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు చిత్ర బృందం ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. సినిమా రన్‌టైమ్‌ 157 నిమిషాల అని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ట్వీట్‌లో పేర్కొంది. లారెన్స్‌ మొదటి పాన్‌ ఇండియా ఈ సినిమా రానుంది. ‘చంద్రముఖి’లో రజనీకాంత్‌ పోషించిన పాత్రను ఇందులో లారెన్స్‌ రాఘవ పోషించారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో రాజనర్తకిగా కనిపించనుంది. ఇప్పుడు ఈ చిత్రంపై దక్షిణాదితోపాటు బీటౌన్‌లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్‌, సాంగ్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగు ప్రమోషన్స్‌ కోసం లారెన్స్‌, కంగనా తదితరులు హైదరాబాద్‌ చేరుకున్నారు.

Updated Date - 2023-09-23T18:07:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!