కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kotabommali PS: కాంట్రవర్సీలు కూడా వచ్చే అవకాశం ఉంది: బన్నీ వాసు

ABN, First Publish Date - 2023-11-07T15:42:12+05:30

'కోటబొమ్మాళి పీఎస్' నవంబర్ 24న విడుదలవుతోంది. ఈ సినిమా నుండి టీజర్ ని నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ఈ చిత్రం కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించారు అని చెప్పారు.

A still from Kotabommali PS

సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) ప్రధాన పాత్రలో, రాహుల్ విజయ్ (RahulVijay), శివాని (ShivaniRajasekhar), వరలక్ష్మి శరత్ కుమార్ (VaralakshmiSarathKumar) లు ఇతర ముఖ్య పాత్రల్లో వస్తున్న చిత్ర 'కోటబొమ్మాళి పీఎస్'. #KotabommaliPS బన్నీ వాసు (BunnyVasu) దీనికి నిర్మాత. ఈ సినిమా నవంబర్ 24న విడుదలవుతోంది. ఇది మలయాళం సినిమా 'నయట్టు' #Nayattu కి రీమేక్ గా తెలుగులో వస్తోంది. ఇది పోలీస్ శాఖ, రాజకీయ రంగంలో ఎలా నలిగి పోయింది, ఆ రెండు విభాగాల్లో అంతర్లీనంగా ఏమి జరుగుతోంది అని చూపించే డార్క్ కథ ఇది. దీనికి తేజ మార్ని దర్శకుడు.

నిన్న ఈ సినిమా టీజర్ లాంచ్ అయింది. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చి ఈ టీజర్ ని లాంచ్ చేసాడు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, టీజర్ లాంచ్ చెయ్యడానికి వచ్చిన అనిల్ రావిపూడి (AnilRavipudi) కి థ్యాంక్స్ చెప్పారు. అలాగే అనిల్ సినిమాలంటే తనకి చాలా ఇష్టంమని చూపుతో, 'కోటబొమ్మాళి పీఎస్' సినిమాలోని 'లింగిడి లింగిడి' పాటకు అనిల్ సినిమా నే స్ఫూర్తి అని చెప్పారు.

'రాజా ది గ్రేట్' చిత్రంలోని 'గున్న గున్న మామాడి' సాంగ్‌ చూసి, ఈ సినిమాలో కూడా ఒక జానపదం గీతం పెట్టాలని ఆలోచన వచ్చింది. 'లింగిడి లింగిడి' పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అని చెప్పారు బన్నీ వాసు. "ఈ పాట వలనే మా సినిమాకు మరింత బజ్ వచ్చింది. తేజ డైరెక్షన్‌తో పాటు కాశీ నాగేంద్ర రాసిన డైలాగ్స్‌ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ఈ డైలాగ్స్ ద్వారా మాపై కాంట్రవర్సీలు కూడా వచ్చే అవకాశం ఉంది," అని చెప్పాడు బన్నీ వాసు. ఎలక్షన్‌లో జరిగే చాలా విషయాలు దగ్గర్నుంచీ చూసిన అనుభవం నాకుంది. వాటిలో నుంచి చాలా సెటిల్డ్‌గా ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తేజ ఈ సినిమాలో బాగా చూపించారు, అని చెప్పారు.

ఎలక్షన్స్‌లో పాల్గొనే వారికి, పొలిటిషీయన్స్‌కు ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ప్రభావితం చేసేలా ఉంటుంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దీన్ని రూపొందిచారు. సిస్టమ్ రాజకీయాలకి ఎలా లొంగిపోయిందనేది ఈ సినిమా కాన్పెస్ట్. అంతే కానీ ఇది ఏ పార్టీకి కొమ్ము కాసేలా ఉండదు. టీమ్ అందరికీ ఈ చిత్రం మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నా, అని చెప్పారు బన్నీ వాసు.

Updated Date - 2023-11-07T16:34:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!