సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RRR: నాటు నాటు ఫీవర్‌ అక్కడికి చేరింది.. జంగ్‌కుక్‌ ఏం చేశాడంటే..!

ABN, First Publish Date - 2023-03-04T13:02:32+05:30

నాటు నాటు’ పాట ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! పాటొచ్చి ఏడాది కావొస్తున్నా.. ట్రెండింగ్‌ విషయంలో తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తోంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఫీవర్‌ కనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నాటు నాటు’ (Natunatu) పాట ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! పాటొచ్చి ఏడాది కావొస్తున్నా.. ట్రెండింగ్‌ విషయంలో తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తోంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఫీవర్‌ కనిపిస్తోంది. ప్యాన్‌ వరల్డ్‌లో ఈ పాటకు ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో దక్షిణ కొరియా (south korea)కూడా చేరింది. అక్కడి మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘బీటీఎస్‌’ (BTS Singer Jungkook) సింగర్‌ జంగ్‌కుక్‌ కూడా ఈ పాటకు ఫిదా అయ్యారు. ‘బీటీఎస్‌’ దక్షిణ కొరియాకు చెందిన మ్యూజిక్‌ బ్యాండ్‌. జంగ్‌కుక్‌, ఆర్‌ఎం, వి, జిమిన్‌, జిన్‌, జె.హోప్‌, సుగా.. ఇలా ఏడుగురితో ఈ బ్యాండ్‌ నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్లలో ఈ బ్యాండ్‌కు అభిమానులున్నారు. ఇటీవల అభిమానులతో నిర్వహించిన లైవ్‌ షోలో జంగ్‌కుక్‌.. ‘నాటు నాటు’ పాటను ఎంతో ఎంజాయ్‌ చేశారు. సీటులో కూర్చొనే పాటకు స్టెప్పులేశారు. (Natu natu Fever at Bts Music band)

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బృందం తాజాగా స్పందించింది. ‘‘జంగ్‌కుక్‌... ఈ పాటను మీరు ఇంతలా ప్రేమిస్తున్నారని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీకు, బీటీఎస్‌ బృందం, దక్షిణ కొరియా మొత్తానికి టన్నుల కొద్దీ ప్రేమాభిమానాన్ని పంపిస్తున్నాం’’ అని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ (RRR team) ట్విట్టర్‌ వేదికగా పేర్కొంది.

మరోవైపు, ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌కు (RRR for oscar) నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే! అయితే ఇంతగా ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రానికి తప్పకుండా ఆస్కార్‌ రావాలని వస్తుందని సినీ ప్రియులు ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - 2023-03-04T13:02:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!