Brahmanandam: బ్రహ్మానందం ఇంట నిశ్చితార్థం
ABN, First Publish Date - 2023-05-22T14:33:46+05:30
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam) రెండో కుమారుడు సిద్దార్థ్ (Siddharth) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె, డాక్టర్.ఐశ్వర్యను ఆయన వివాహం చేసుకోనున్నారు.
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam) రెండో కుమారుడు సిద్దార్థ్ (Siddharth) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె, డాక్టర్.ఐశ్వర్యను ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ వేడుకలో పాల్గొని కాబోయే దంపతులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. పలువురు నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. హాస్య నటుడు బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గౌతమ్ పలు చిత్రాల్లో హీరోగా నటించారు. రెండో తనయుడు సిద్దార్థ్.. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. త్వరలోనే సిద్దార్థ్, ఐశ్వర్యల వివాహం జరగనుంది. (Brahmanandam younger son engagement)