కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Biggboss 7: ఒంటరి పోరాటం చేశాడు.. ఫినాలేలో ఉంటాడా?

ABN, First Publish Date - 2023-12-02T11:24:32+05:30

బిగ్‌బాస్‌ హౌస్‌లో టికెట్‌ టు ఫినాలే అస్త్ర పోటీ చివరి దశకు చేరుకుంది. బిగ్‌బాస్‌ పెట్టిన గేమ్స్‌లో ఎక్కువగా అర్జున్‌, రైతుబిడ్డ గెలుచుకుంటూ పోగా అమర్‌ అందరి దగ్గరా పాయింట్లు అడుక్కుంటూ టాప్‌ స్థానంలో నిలబడ్డాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌(Biggboss 7)లో టికెట్‌ టు ఫినాలే అస్త్ర పోటీ చివరి దశకు చేరుకుంది. బిగ్‌బాస్‌ పెట్టిన గేమ్స్‌లో ఎక్కువగా అర్జున్‌, రైతుబిడ్డ గెలుచుకుంటూ పోగా అమర్‌ అందరి దగ్గరా పాయింట్లు అడుక్కుంటూ టాప్‌ స్థానంలో నిలబడ్డాడు. అతనికి ఎవరూ పాయింట్లు ఇవ్వకపోయినా టాప్‌ 3-4 స్థానాల్లో ఉండేవాడు. కానీ ఎక్కడ రేసులో నుంచి అవుట్‌ అయిపోతానో అన్న భయంతో అందరినీ బతిమాలుకుంటున్నాడు. రెండు టాస్కులు మాత్రమే గెలిచిన అమర్‌ అందరూ ఇచ్చిన పాయింట్లతో స్కోర్‌ బోర్డ్‌లో టాప్‌లో ఉన్నాడు. కానీ అర్జున్‌ ఎవరి దగ్గరా ఒక్క పాయింట్‌ తీసుకోకుండా సొంతంగా ఆడి ఐదు గేమ్స్‌ గెలిచాడు.

సోషల్‌ మీడియాలో నడుస్తున్న ప్రచారం ప్రకారం అర్జున్‌ టికెట్‌ టు ఫినాలే గెలిచినట్లు అర్థమవుతోంది. అంత మాత్రాన అతను టాప్‌ 5లో ఉన్నట్లు కాదు. తనముందు ఈ వారం ఎలిమినేషన్‌ కూడా ఉంది. ఈవారం దాటుకుని ముందుకు వస్తేనే అతను ఫినాలేలో ఉంటాడు. నామినేషన్‌లో ఎంతో నెగెటివిటీ ఉన్నా టికెట్‌ టు ఫినాలేలో మాత్రం టాస్కులతో అదరగొట్టి అదుర్స్‌ అనిపించుకున్నాడు అర్జున్‌. ఎవరూ సాయం చేయకపోయినా ఒంటరిగా పోరాడి గెలిచాడు. మరి అర్జున ఈ వారం సేఫ్‌ అవుతాడా? టాప్‌ 5లో నిలుస్తాడా? అన్నది చూడాలి!

Updated Date - 2023-12-02T11:24:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!