కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BiggBoss 7 : నువ్వెంత అంటే నువ్వుంత.. జోరుగా నామినేషన్స్ !

ABN, First Publish Date - 2023-10-17T15:56:32+05:30

బిగ్‌బాస్‌(Biggboss7) హౌస్‌లో ఏడోవారం నామినేషన్స మంచి హీట్‌గా సాగుతున్నాయి. అలా నామినేషన్స్  ప్రారంభం అయ్యాయో లేదో రైతుబిడ్డ ప్రశాంత్‌ ఓ అపరిచితుడులా ప్రవర్తించాడు. ఇంటి సభ్యులు చెప్పింది అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతూ అరుస్తూ రెచ్చిపోయాడు

బిగ్‌బాస్‌(Biggboss7) హౌస్‌లో ఏడోవారం నామినేషన్స మంచి హీట్‌గా సాగుతున్నాయి. అలా నామినేషన్స్  ప్రారంభం అయ్యాయో లేదో రైతుబిడ్డ ప్రశాంత్‌ ఓ అపరిచితుడులా ప్రవర్తించాడు. ఇంటి సభ్యులు చెప్పింది అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతూ అరుస్తూ రెచ్చిపోయాడు. శివాజీ విషయంలోనూ అందరికీ చిన్న షాక్‌ తగిలింది. తాజా ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం...

ఆదివారం నయని పావని ఎలిమినేట్‌ అయింది. వచ్చి వారం కూడా కాలేదు ఊహించని రీతిలో ఎలిమినేట్‌ కావడంతో ఇంటి సభ్యులంతా షాక్‌లో ఉన్నారు. ఉదయానికి అందరూ కాస్త తేరుకున్నారు. రెండు వారం క్రితం టాస్క్‌లో శివాజీ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే! 10 రోజులుగా అలాగే ఆడుతూ వస్తున్నాడు. తాజాగా బిగ్‌బాస్‌ అనుమతితో స్కాన కోసం బయటకు వెళ్లి మళ్లీ వచ్చేశాడు. ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా కంటెస్టెంట్‌ ఎదురుగా ఉన్న కుండ పగలగొట్టి కారణం చెప్పాలని సెలవిచ్చారు బిగ్‌బాస్‌. అయితే ప్రశాంత్‌, అశ్విని, షావలి, తమని నామినేట్‌ చేస్తున్నారని ఫ్రస్ర్టేట్‌ అయి సమయం మొత్తం తినేశాడు. దీంతో సోమవారం కేవలం ఏడుగురు మాత్రమే తమ తమ నామినేషన్స్‌ పూర్తి చేశారు. మిగిలిన వాళ్లు మంగళవారం నామినేషన చేయాల్సిందే!

ఇక రైతు బిడ్డ ట్యాగ్‌తో ఇంట్లో ఉన్న పల్లవి ప్రశాంత తొలివారం నుంచి కాస్త డిఫరెంట్‌గానే ఉన్నాడు. గేమ్స్‌లో బాగా ఆడటం, మిగిలిన సమయం శివాజీ వెనక ఉండడం, నామినేషన్స్  సమయంలో ఎవరు ఏం చెబుతున్నారో వినకుండా గోల చేయడం ఇదే అతని పని. తాజా ఎపిసోడ్‌లో కూడా అదే చేశాడు. కెప్టెన్సీ సరిగా చేయలేకపోయావ్‌ కదా అని సందీప్‌.. అన్నాడు. ఆ విషయాన్ని పక్కదారి పట్టించి.. సందీప్‌ తనని ‘ఊరోడు’ అన్నాడని గట్టిగా అరుస్తూ అల్లరిచేశాడు. అయితే ఇది నిజమైతే పొలం, తినే అన్నంపై ఒట్టు వేయ్‌ అని సందీప్‌ అడగ్గానే మళ్లీ మాట మార్చేశాడు. రైతు అనేవాడు పొలంపై ఒట్టు వేయడు అని ఏదేదో చెప్పి కాస్త అతి చేశాడు. సందీప్‌ మాట్లాడుతుంటే అతడు చెబుతున్నది వినకండా పదే పదే మాటలకు అడ్డు పడ్డాడు.

ఇక అర్జున్‌, ప్రియాంక, అమరదీప్‌, పూజా వరుసగా తనని నామినేట్‌ చేయడంతో అశ్విని తట్టుకోలేకపోయింది. తనతో ఎవరూ కలవట్లేదని, మాట్లాడట్లేదని అదే కారణంగా గుచ్చిగుచ్చి చెప్పింది. భోలె షావలి అయితే మరోరకం. అమరదీప్‌, పూజా తనని నామినేట్‌ చేసినా భోలె ఏం మాట్లాడలేదు. వాళ్లు చెప్పిన కారణాల్ని అస్సలు డిఫెండ్‌ చేయలేదు. ఏదో అవతలి వాళ్ల ఆనందమే తనకు ముఖ్యమున్నట్లు ప్రవర్తించాడు. ఇక ప్రియాంక నామినేట్‌ చేసిన తర్వాత ఆమెని ఇరిటేట్‌ చేస్తూ పాటలు పాడుతూ జోక్స్‌ వేస్తూ ఇబ్బంది పెట్టాడు.

ఎవరు ఎవరిని నామినేట్‌ చేశారంటే..

అమరదీప్‌- భోలె, అశ్విని

సందీప్‌- భోలె, ప్రశాంత్‌

ప్రశాంత్‌ - సందీప్‌, తేజ

పూజామూర్తి- భోలె, అశ్విని

అర్జున్‌- భోలె, అశ్విని

ప్రియాంక- అశ్విని, భోలె

తేజ- పూజా, ప్రశాంత్‌

Updated Date - 2023-10-17T16:26:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!