సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bhuvana Vijayam: పది లక్షలు.. ఎనిమిది మంది.. ఏడు కథలు

ABN, First Publish Date - 2023-03-14T17:56:09+05:30

సునీల్‌(sunil), శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘భువన విజయం’. నూతన దర్శకుడు యలమంద చరణ్‌ దర్శకత్వంలో కిరణ్‌, వి.ఎస్‌కె నిర్మిస్తున్న చిత్రమిది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సునీల్‌(sunil), శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘భువన విజయం’. నూతన దర్శకుడు యలమంద చరణ్‌ దర్శకత్వంలో కిరణ్‌, వి.ఎస్‌కె నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు.

ఒక కథానాయకుడు.. అతని కథేంటో అతనికే తెలీదు..

ఒక ప్రొడ్యూసర్‌.. తనకి జాతకాల పిచ్చి..

ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు..

సచ్చికూడా ఇంకా మనుషులు మధ్య తిరుగుతున్న ఓ ఆత్మ...

చావుబతుకుల మధ్య ఉన్న కూతురుని బతికించుకోవడానికి ఓ తండ్రి పడే వేదన..

పది లక్షలు.. ఎనిమిది మంది.. ఏడు కథలు (Bhuvana vijayam Teaser)

నాలుగు గోడల మధ్య.. మూడు గంటల కాలంలో ఇద్దరు చావాలి, ఒక కథ తేలాలి’ అంటూ సాగిన వాయిస్‌తో ఆసక్తికరంగా సాగింది టీజర్‌. సునీల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధనరాజ్‌ ప్రధాన తారాగణం అంతా చక్కని నటన కనబర్చారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా సాగే థ్రిల్లర్‌ ఇది. శేఖర్‌ చంద్ర సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’’ అని దర్శకుడు అన్నారు. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు.

Updated Date - 2023-03-14T17:56:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!