సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bhoothaddam Bhaskar Narayana: విడుదల తేదీ ఫిక్సయింది

ABN, First Publish Date - 2023-01-13T20:43:55+05:30

శివ కందుకూరి (Shiva Kandukuri) హీరోగా.. రాశి సింగ్ (Rashi Singh) హీరోయిన్‌గా పురుషోత్తం రాజ్‌ (Purushotham Raaj)‌‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ..

Bhoothaddam Bhaskar Narayana
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివ కందుకూరి (Shiva Kandukuri) హీరోగా.. రాశి సింగ్ (Rashi Singh) హీరోయిన్‌గా పురుషోత్తం రాజ్‌ (Purushotham Raaj)‌‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ..స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా.. మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌‌పై నిర్మించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana). ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ నుంచి.. ఇప్పటి వరకు విడుదలైన వన్నీ మంచి స్పందనను రాబట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని 31 మార్చి 2023న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు. ఈ విషయం తెలుపుతూ ఓ మోషన్ పోస్ట‌ర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. మార్చి 31న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఆ రోజున ఈ భూత‌ద్దం భాస్క‌ర్‌ నారాయ‌ణ చిత్రాన్ని చూసేందుకు థియేట‌ర్‌కి వ‌చ్చిన ప్ర‌తి ప్రేక్ష‌కుడికి ఎడ్జ్ ఆఫ్ ద సీట్‌గా ఈ చిత్రం అలరిస్తుంది. ఈ చిత్రంలో ఏ స‌న్నివేశాన్ని కూడా ముందుగా ఊహించలేం.. అలా ద‌ర్శ‌కుడు స్క్రీన్‌ప్లేని రెడీ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి మ‌రిన్ని అప్‌డేట్స్ సంక్రాంతి సీజ‌న్ తరువాత ప్రేక్ష‌కుల‌కి అందిస్తామని తెలిపారు. కాగా.. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జ‌రుగుతున్నాయి.

Updated Date - 2023-01-13T20:44:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!