కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhola Shankar Muchatlu: తన పీక నొక్కేయాలనిపించింది

ABN, First Publish Date - 2023-08-08T13:21:20+05:30

చిరంజీవి, తమన్నా జంటగా రూపొందిన చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో భాగంగా గెటప్‌ శ్రీను వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఇంటర్వ్యూలో చిరంజీవి, కీర్తి సురేశ్‌, తమన్నా, మెహర్‌, నిర్మాత అనిల్‌ సుంకర ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

చిరంజీవి(Bhola Shankar), తమన్నా (Tamannah) జంటగా రూపొందిన చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేశ్‌ (Meher Ramesh)దర్శకుడు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో భాగంగా గెటప్‌ శ్రీను వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఇంటర్వ్యూలో చిరంజీవి, కీర్తి సురేశ్‌, తమన్నా, మెహర్‌, నిర్మాత అనిల్‌ సుంకర ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. (Chiranjeevi)

బాధను దిగమింగుకొని...

నటనలో తమన్నా పర్ఫెక్షనిస్ట్‌ అని చిరంజీవి అన్నారు. ‘తను 50 చిత్రాలు చేసినప్పటికీ ప్రస్తుతం చేస్తున్న చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తుందని గమనించా. ‘భోళా శంకర్‌’ సెట్‌లో ఒక సీన్‌ ఇస్తే పదో తరగతి పిల్లాడు ప్రిపేర్‌ అయినట్లు ఆ సీన్‌ను చదువుకుంది. డైలాగ్‌ ప్రాంప్ట్‌ చేయొచ్చు అని చెప్పినా తను నేర్చుకుని డైలాగ్‌ చెప్పింది. తన అంకితభావం ఏంటో తెలిసింది. అదీ కాకుండా సాంగ్‌ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో వాళ్ల నాన్నగారికి మేజర్‌ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆయనేమో ముంబై ఆస్పత్రిలో.. మేమంతా విదేశాల్లో! షాట్‌ చేయడం.. తర్వాత పక్కకు వెళ్లి తండ్రి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం. మళ్లీ టేక్‌ అనగానే నటిగా తన పనిని తాను సక్రమంగా చేయడం చూశాం. తండ్రి ఆరోగ్యం బాగోలేదంటే ఎవరి మనసుకైనా కష్టంగానే ఉంటుంది. కానీ ఆ మనోవేదనను బయటకు రానివ్వకుండా మేనేజ్‌ చేసింది. అలాంటి  సమయంలో తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఆ భరోసా వేరుగా ఉంటుంది. కానీ కమిట్‌మెంట్‌ మిస్‌ కాకూడదని ఆ సాంగ్‌ చేసింది. అది నన్ను టచ్‌ చేసింది’’ అని చిరంజీవి తమన్నా గురించి చెప్పారు.

మరో సన్నివేశం గురించి చెబుతూ.. ఇందులో తమన్నా నన్ను బ్యాట్‌ పట్టుకుని కొట్టడానికి వచ్చే సన్నివేశం ఒకటుంది. ఆ సన్నివేశం చేస్తునప్పుడు ‘దొంగమొగుడు’ సినిమా గుర్తొచ్చింది. అందులో రాధిక నాతో అలాగే పొట్లాడుతుంది. అప్పట్లో ఆ సీన్‌ బాగా పేలింది. ఇప్పుడు ఈ సీన్‌ కూడా అలాగే పండుతుందని నమ్మకం ఉందని చిరంజీవి అన్నారు.

కీర్తి ఫుడీ...

కీర్తిసురేశ్‌ గొప్ప నటి మాత్రమే కాదు.. మంచి ఫుడీ కూడా. లిమిటెడ్‌గా తింటుంది కానీ ఫుడ్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. ఓ రోజు సెట్‌లో హైదరాబాద్‌ ఫుడ్‌ నాకు సెట్‌ కావట్లేదు.. అని మొహమాటంగా చెప్పింది. అప్పటి నుంచీ ప్రతి రోజు మా ఇంటి నుంచే తనకు కూడా భోజనం వచ్చేది. మా ఇంట్లో తమిళ కుక్‌ ఉన్నాడు. తనకు ఏం కావాలో చేసి పంపేవారు. అయితే తిన్న తర్వాత 'అన్ని బావున్నాయి.. కానీ ఇందులో కొంచెం ఇది తగ్గింది.. కరెక్ట్‌ చేస్తే బావుంటుంది' అంటూ కామెంట్లు చేసేది. అప్పుడు తన పీక నొక్కేయాలనిపించేది(నవ్వుతూ). తను పూర్తిగా వెజిటేరియన్‌. రేపటి మెనూ కూడా ఈ రోజే చెప్పేది. ఒకవేళ తాను  నాన్‌వెజ్‌ తింటే.. అది సమయానికి రాకపోతే పక్కనున్నవాళ్లపై ఉప్పు, కారం వేసుకుని తినేస్తుంది’’ అంటూ ఆటపట్టించారు చిరు.


కలగా ఉంది: అనిల్ సుంకర 

చిరంజీవిగారి సినిమా అంటే తీసిన తర్వాత నాకు కలగా అనిపిస్తుంది. ఈ కథ గురించి మెహర్‌ చెప్పినప్పుడు ఎవరైతే బాగుంటుంది అనడిగా. ‘అన్నయ్య అయితే పర్ఫెక్ట్‌ ఫిట్‌’ అన్నాడు మెహర్‌. నేను ఆయనిన కలిసింది రెండుసార్లు మాత్రమే. ఎలాగైనా ఆయనతో సినిమా చేయాల్సిందే’ అని మెహర్‌తో చెప్పా. అంతే ఒక్కో పని ఫటాఫటా అయిపోయాయి.

చెల్లిగా చేస్తే.. చెలిగా చేయకూడదా?

‘భోళా శంకర్‌’ చెల్లిగా నటించిన కీర్తితో హీరోయిన్‌గా చేయాల్సి వస్తే చేస్తారా? అన్న ప్రశ్నకు ‘‘ఈ సినిమాలో చెల్లిగా చేస్తే చెలిగా, సఖిగా చేయకూడదని ఉందా? తప్పకుండా చేస్తాం. ‘రక్త సంబంధం’ చిత్రంలో మహానటి సావిత్రమ్మ, ఎన్టీఆర్‌ అన్నాచెల్లెళ్లుగా నటించారు.. ఆ తర్వాత జంటగానూ నటించారు. ‘ఓ సినిమాలో అన్నాచెల్లెళ్లుగా చేశారు కదా అని లైఫ్‌ అలాగే చేయాలని చెప్పకండి. నేను ఒప్పుకోను’ అని చిరంజీవి చమత్కరించారు.

Updated Date - 2023-08-08T13:36:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!