సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chiranjeevi: భోళాశంకర్‌.. దర్శకుడు ఏం చెప్పారంటే..

ABN, First Publish Date - 2023-07-03T15:31:32+05:30

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’. తమిళంలో ‘వేదాళం’ చిత్రానికి రీమేక్‌ ఇది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి దర్శకుడు ట్విట్టర్‌ వేదికగా అప్‌డేట్‌ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ (Meher Ramesh) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’(Bhola shankar). తమిళంలో ‘వేదాళం’ చిత్రానికి రీమేక్‌ ఇది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి దర్శకుడు ట్విట్టర్‌ వేదికగా అప్‌డేట్‌ ఇచ్చారు. సెట్‌లో చిరంజీవితో దిగిన ఫొటోలు షేర్‌ చేసి ‘భోళా శంకర్‌’ షూటింగ్‌ పూర్తయిందని చెప్పారు. విరామం లేకుండా పని చేసిన తన టీమ్‌కు ధన్యవాదాలు చెప్పారు. ‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో పాటలకు సంబంధించి అప్‌డేట్స్‌ ఇస్తాం’’ అని పేర్కొన్నారు.

అన్నాచెల్లెళ్ల అనుబంధంతో ముడిపడి ఉన్న ఓ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. తమన్నా కథానాయిక. చిరుకి చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటించారు. తాజాగా విడుదలైన టీజర్‌, చిరు లీక్‌ చేసిన సంగీత్‌ సాంగ్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే! టీజర్‌లో చిరంజీవి తన మార్క్‌ నటన, డైలాగ్‌లతో అలరించారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాం బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Updated Date - 2023-07-03T15:31:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!