Bhola Shankar : ఇప్పుడు బుల్లితెర వీక్షకుల కోసం...
ABN, First Publish Date - 2023-09-10T13:05:40+05:30
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకుడు. తమన్నా కథానాయిక. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పరాజయాన్ని చవి చూసింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో స్ర్టీమింగ్ కానుంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భోళా శంకర్’ (Bhola Shankar). మెహర్ రమేశ్ (Meher Ramesh) దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్, మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేశ్ (Keerthy suresh) నటించారు. తమన్నా (Tamannah) కథానాయిక. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పరాజయాన్ని చవి చూసింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో స్ర్టీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి ఇది సినీ ప్రియులకు అందుబాటులో ఉండనుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఎ.కు. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాంబ్రహ్మం సుంకర నిర్మించారు.
కథ:
తన చెల్లె (కీర్తిసురేశ్) చదువు కోసం శంకర్ (చిరంజీవి) కలకత్తా వెళ్తాడు. ఆమెను ఓ కాలేజీలో చేర్పించి.. తాను టాక్సీ డ్రైవర్‌గా జీవితాన్ని మొదలుపెడతాడు. మహాలక్ష్మిని చూసి శ్రీకర్ (సుశాంత్) ప్రేమలో పడతాడు. ఆ ఇద్దరికీ పెళ్లి చేయాలనే ప్రయత్నాల్లో ఉంటూనే, మానవ అక్రమ రవాణాకి పాల్పడుతున్న అలెగ్జాండర్ (తరుణ్ అరోరా) సోదరుల్లో ఒక్కొక్కరినీ అంతం చేయడం మొదలు పెడతాడు శంకర్. ఆ విషయాన్ని కళ్లారా చూస్తుంది శ్రీకర్ సోదరి, క్రిమినల్ లాయర్ లాస్య (తమన్నా). ఆ తర్వాత ఏం జరిగీంది? మానవ అక్రమ రవాణా ముఠాతో శంకర్‌కి ఉన్న వైరం ఏమిటి? తర్వాత ఏం జరిగింది అన్నది కథ.