సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bhola Shankar: అదిరే స్టైలయ్యా... పగిలే స్వాగయ్యా.. యుఫోరియా నా ఏరియా!

ABN, First Publish Date - 2023-06-04T16:36:15+05:30

చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. మహతి స్వరసాగర్‌ (Mahati Swarasagar) సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘అదిరే స్టైలయ్యా... పగిలే స్వాగయ్యా.. యుఫోరియా నా ఏరియా.. భోళా మానియా’ (Bhola mania) అంటూ సాగే పాటను ఆదివారం విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’ (Bhola shankar). మెహర్‌ రమేశ్‌ (Mehar Ramesh) దర్శకుడు. అనిల్‌ సుంకర్‌ నిర్మాత. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘అదిరే స్టైలయ్యా... పగిలే స్వాగయ్యా.. యుఫోరియా నా ఏరియా.. భోళా మానియా’ అంటూ సాగే పాటను ఆదివారం మ్యూజిక్‌ మిసైల్‌ దేవిశ్రీ ప్రసాద్‌ విడుదల చేశారు(DSP).

''చిరంజీవి గారి భోళా శంకర్‌’ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా’’ అని అన్నారు. సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పాటను ఒక తుపాన్‌లా తీర్చిదిద్దావని భావిస్తున్నా. ‘తమ్ముడు జస్ట్‌ డు కుమ్ముడు’’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

దేవిశ్రీ ప్రసాద్‌ (Devisri Prasad) ట్వీట్‌కు చిరంజీవి రిప్లై ఇచ్చారు. ‘థ్యాంక్యూ తమ్ముడు. ఈ సాంగ్‌ డబుల్‌ కుమ్ముడు అవుతుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

ఇందులో మెగాస్టార్‌ కాస్ట్యూమ్స్‌, డాన్సింగ్‌ స్టైల్‌ ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను మహతి, ఎల్‌.వి. రేవంత్‌ ఆలపించారు. హుషారుగా సాగే ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ చిరుకి చెల్లెలిగా నటిస్తోంది.

Updated Date - 2023-06-04T16:52:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!