Bharateeyans: చైనాను చీల్చి చెండాడే సినిమా ఇది..
ABN, First Publish Date - 2023-07-13T19:49:31+05:30
రోజురోజుకు బలపడుతున్న మన మాతృభూమి భారత్‌ని బలహీనం చేసేందుకు డ్రాగన్ కంట్రీ చైనా పన్నుతున్న దుష్ట పన్నాగాలను, ఈ క్రమంలో ఆ దేశం చేస్తున్న దురాగతాలను బట్టబయలు చేస్తూ రూపొందిన ద్విభాషా చిత్రం ‘భారతీయన్స్’ అన్నారు నిర్మాత శంకర్ నాయుడు. ఈనెల 14న హిందీ, తెలుగు భాషల్లో విడుదలకాబోతోన్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆలోచింపజేస్తుందని ఆయన తెలిపారు.
రోజురోజుకు బలపడుతున్న మన మాతృభూమి భారత్‌ని బలహీనం చేసేందుకు డ్రాగన్ కంట్రీ చైనా పన్నుతున్న దుష్ట పన్నాగాలను, ఈ క్రమంలో ఆ దేశం చేస్తున్న దురాగతాలను బట్టబయలు చేస్తూ రూపొందిన ద్విభాషా చిత్రం ‘భారతీయన్స్’ (Bharateeyans) అన్నారు నిర్మాత శంకర్ నాయుడు. ‘ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, ప్రేమంటే ఇదేరా’ వంటి బ్లాక్‌బస్టర్ లవ్ మూవీస్‌కు కథలను అందించిన రచయిత దీన్ రాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై.. ప్రవాస భారతీయుడైన డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించిన చిత్రం ‘భారతీయన్స్’. ఈ సినిమా ఈనెల 14న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత శంకర్ నాయుడు (Dr Shankar Naidu Adusumilli) మాట్లాడుతూ... గత 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటూ.. మన దేశం మీద ప్రేమ, అభిమానంతో నిర్మించిన ఈ దేశభక్తి చిత్రానికి సెన్సార్ పరంగా ఎదురైన ఇబ్బందులు కొంచెం బాధ కలిగించినా... సినిమా చూసిన వారందరూ ముక్త కంఠంతో అభినందించడం మా కష్టాలు మర్చిపోయేలా చేసిందని అన్నారు. చైనా దురాగతాలను ఎండగట్టే సినిమా ఇది. కచ్చితంగా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని తెలిపారు. దర్శకుడు దీన్ రాజ్ (Deen Raj) మాట్లాడుతూ... దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలను మేళవించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని అన్నారు. ‘భారతీయన్స్’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యే అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు నీరోజ్ పుచ్చా. ఈ చిత్రానికి సంగీతం అందించినందుకు గర్వంగా ఉందన్నారు సంగీత దర్శకుడు సత్య కశ్యప్.
ఇవి కూడా చదవండి:
**************************************
*AR Rahman: నేను రామ్‍చరణ్ RC16కు పని చేస్తున్నా..
**************************************
*MS Dhoni: నా భార్య సినిమా అన్నప్పుడు.. నేను తనతో ఒకే మాట చెప్పా..
**************************************
*Rashmika Mandanna: నితిన్, వెంకీ కుడుమల కాంబో ఫిల్మ్ నుంచి రష్మిక ఔట్.. కారణం ఏంటంటే?
**************************************
*Kavya Kalyanram: నేనలా ఎక్కడా చెప్పలేదు.. దయచేసి ఆ వార్తలు ఆపండి
**************************************
*Kushi Song: ‘ఆరాధ్య.. నువ్వేలేని ఏదీ వద్దు ఆరాధ్య’.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా..
**************************************
*Gandheevadhari Arjuna: అర్జునుడి రథంలోని అశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా..
**************************************