కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhairadevi: ‘భైరాదేవీ’ పోస్టర్ వైరల్..

ABN, First Publish Date - 2023-11-13T02:06:29+05:30

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య, కన్నడ ప్రముఖ నటి రాధికా కుమారస్వామి నటిస్తోన్న తాజా చిత్రం ‘భైరా దేవీ’. ఇందులో ఆమె అఘోరగా కనిపించబోతున్నారు. రాధిక బర్త్‌డే సందర్భంగా ‘భైరా దేవీ’ నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Bhairadevi Movie Special Still

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య, కన్నడ ప్రముఖ నటి రాధికా కుమారస్వామి (Radhika Kumaraswamy) నటిస్తోన్న తాజా చిత్రం ‘భైరా దేవీ’ (Bhairadevi). ఇందులో ఆమె అఘోర (Aghora)గా కనిపించబోతున్నారు. రాధిక బర్త్‌డే సందర్భంగా ‘భైరా దేవీ’ నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను (Bhairadevi Special Poster) మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందుకు కారణం ఈ పోస్టర్‌లో రాధిక ఓ అఘోరగా కనిపిస్తుండటమే.

ఈ పోస్టర్‌లో రాధిక (Radhika) త్రిశూలం చేత పట్టుకుని కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో అఘోరాలు కూడా కనిపిస్తున్నారు. పోలీస్ పాత్రలో రమేష్ అరవింద్ (Ramesh Aravind) కనిపిస్తున్నారు. లేడీ అఘోర పాత్రను మెయిన్ లీడ్‌గా పెట్టి సినిమా తీస్తుండటం ఇదే మొదటిసారి కావడంతో అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి క్రియేట్ అవుతోంది. ‘భైరా దేవీ’ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగానూ రాధిక కుమారస్వామి వ్యవహరించారు. శ్రీజై (Shrijai) ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందిస్తున్నారు.


రంగయాన రఘు, రవి శంకర్, స్కంద అశోక్, అను ముఖర్జీ, మాళవిక అవినాష్, సుచేంద్ర ప్రసాద్ వంటి వారు నటించిన ఈ చిత్రానికి రవిరాజ్, యాదవ్‌లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. జేఎస్ వాలి సినిమాటోగ్రఫర్‌గా, కేకే సెంథిల్ ప్రసాద్ సంగీత దర్శకుడిగా, సీ రవిచంద్రన్ ఎడిటర్‌గా, కే రవి వర్మ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి, తమిళంలో తమరాయ్, శ్రీజై సాహిత్యాన్ని అందించారు. వారణాసి, కాశీ, హరిద్వార్, హైద్రాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రదేశాల్లో ఈ మూవీని షూట్ చేస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. (Bhairadevi Special Poster Released)


ఇవి కూడా చదవండి:

========================

*Ajagratha: ‘అజాగ్రత’లో కర్ణాటక మాజీ సీఎం భార్య..

*****************************

*Lal Salaam Teaser: మరో ‘జైలర్’ని తలపించిన మొయిద్దీన్ భాయ్‌

*****************************

*Family Star: పోస్టర్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ దీపావళి సందడి

****************************

Updated Date - 2023-11-13T02:06:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!