సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RRR For Oscar -Betting: పందేల బరిలో!

ABN, First Publish Date - 2023-03-12T14:46:00+05:30

‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ నామినేషన్‌లో భాగమైంది. (Natu Natu) ఎన్నో ఏళ్ల తర్వాత ఆస్కార్‌ బరిలో భారత చిత్రం చోటు దక్కించుకుంది. (Rrr for OScar) బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగొరీలో పోటీ పడుతోంది. (Best original song) యావత్‌ భారతావని ఈ చిత్రానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆస్కార్‌ ఖాయం అని నమ్ముతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ నామినేషన్‌లో భాగమైంది. (Natu Natu)

ఎన్నో ఏళ్ల తర్వాత ఆస్కార్‌ బరిలో భారత చిత్రం చోటు దక్కించుకుంది. (Rrr for OScar)

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగొరీలో పోటీ పడుతోంది. (Best original song)

యావత్‌ భారతావని ఈ చిత్రానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆస్కార్‌ ఖాయం అని నమ్ముతోంది.

కొందరు అడుగు దూరంలో ఆస్కార్‌ అంటుంటే...

కొందరైతే కాదు కాదు.. ‘ఆస్కార్‌’ అరచేతిలోనే ఉందంటున్నారు.

అదే నిజం కావాలని తెలుగు ప్రేక్షకులతోపాటు దేశం మొత్తం కోరుకుంటోంది. (Betting on Oscar Award)

‘ఆస్కార్‌’ గొప్ప పురస్కారం అయినప్పటికీ ఆ స్థాయి చిత్రాలు ఈ మధ్యకాలంలో రాకపోవడంతో మనవాళ్లు పెద్దగా పట్టించుకొనేవారు కాదు. మన చిత్రాలు ఆ స్థాయికి వెళ్లకపోవడం అప్పట్లో అదొక కారణం. కానీ ఇప్పుడు అలా కాదు.. భారత్‌ నుంచి ‘నాటు నాటు’ ఆస్కార్‌ బరిలో నిలిచింది. మరికొన్ని గంటల్లో ఆస్కార్‌ ‘ఆస్కార్‌’ మనకు దక్కిందా లేదా అన్నది తెలిసిపోతుంది. ఈలోపే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ వస్తుందని కొందరు, రాదని కొందరు, అక్కడి వరకూ వెళ్లింది అదే పెద్ద సంతోషం అని కొందరు బెట్టింగులు మొదలెట్టారు. క్రికెట్‌, ఎలక్షన్ల తరహాలో అవార్డులను బెట్టింగులు వదల్లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ఫర్‌ ఆస్కార్‌’ పేరుతో కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. Betting Started for RRR-oscar)

‘ఆస్కార్‌’ ‘నాటు నాటు’ పాటకు వస్తుందని టాలీవుడ్‌ నిర్మాత.. ఓ దర్శకుడితో పందెం కట్టాడని ఆదివారం ఉదయం నుంచి ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఆ పందెం వేలు, లక్షల్లో కాదు.. అక్షరాల కోటి రూపాయలు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆస్కార్‌ ఖాయం అని గట్టిగా నమ్మిన ఆ నిర్మాత దర్శకుడికి పందెం ఇచ్చి మరీ.. బెట్‌ వేశాడట. (Crores of money betting for RRR) టాక్‌. అంతే కాదు.. బెట్టింగులు, కోడి పందెలకు కేరాఫ్‌ అయిన భీమవరంలో ఆస్కార్‌ అవార్డ్‌ కోసం కోట్లలో బెట్టింగ్‌ జరుగుతోందట. అయితే పందెంలో పాల్గొనవారి జాతకం ఎలా ఉందో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే!

Updated Date - 2023-03-12T15:20:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!