కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bedurulanka 2012: అమ్మ అమెరికా వెళితే సినిమా హిట్, అందుకే నెక్స్ట్ సినిమాకి కూడా...

ABN, First Publish Date - 2023-08-30T17:37:38+05:30

సినిమా వాళ్ళకి, క్రీడాకారులకు ఎక్కువ సెంటిమెంట్స్ ఉంటాయి అంటారు. ముఖ్యంగా క్రికెట్ క్రీడాకారులను చూస్తూ ఉంటాం చాలా సెంటిమెంట్స్, అలాగే సినిమా వాళ్ళకి కూడా వున్నాయి. ఇప్పుడు కార్తికేయ గుమ్మకొండ కి ఇలాంటి సెంటిమెంట్ ఒకటి ....

Producer Benny, special guest Sreevishnu, Kartikeya Gummakonda and Neha Shetty at the success meet of Bedurulanka 2012

కార్తికేయ గుమ్మకొండ (KartikeyaGummakonda) మరో విజయం అందుకున్నాడు. 'ఆర్ఎక్స్ 100' #RX100 సినిమా తరువాత ఇప్పుడు 'బెదురులంక 2012' #Bedurulanka2012 అనే సినిమాతో ఈ విజయాన్ని చవిచూశాడు. ఇది అతని కెరీర్ లో రెండో విజయం. మధ్యలో చాలా సినిమాలు చేసాడు కానీ, విజయం కొంచెం దూరంలోనే ఉండిపోయింది, అంత బ్రేక్ రాబట్టుకోలేక పోయాడు. ఇప్పుడు ఈ 'బెదురులంక 2012' తో అతని కోరిక ఫలించింది, విజయం లభించింది.

ఎవరు ఎక్కడ నుండి, ఎలా వచ్చారో మూలాలు మర్చిపోకూడదు అంటారు కదా, కార్తీక్ కూడా అలా మర్చిపోలేదు. అందుకే ఈ విజయానికి క్రెడిట్ అజయ్ భూపతి (AjayBhupathi) అని చెప్పాడు. దర్శకుడు అజయ్ భూపతి మొదటి సారిగా కార్తీక్ కి 'ఆర్ఎక్స్ 100' అనే హిట్ సినిమా ఇచ్చాడు. అప్పుడే కార్తిక్ నటుడిగా చాలా పాపులర్ అయ్యాడు. అందుకే అయిదేళ్ల తరువాత అతను ఈ 'బెదురులంక 2012' తో విజయం సాధించినా, క్రెడిట్ మాత్రం అజయ్ భూపతి కి ఇచ్చాడు, అది అతని సంస్కారాన్ని చెపుతుంది.

"నాకు ఆర్ఎక్స్ 100తోనే గుర్తింపును ఇచ్చారు. నేను లైఫ్‌లో ఏ సక్సెస్ సాధించినా అది ఆయన వల్లే. ఆయనకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను," అని అజయ్ భూపతి గురించి చెప్పాడు కార్తిక్. అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సినిమాను ఇంత వరకు తీసుకు వచ్చిన నిర్మాత బెన్ని గారికి థాంక్స్ అని చెప్పాడు. అలాగే ఇందులో కథానాయికగా చేసిన నేహా (NehaShetty) ను ఇన్ని రోజులు రాధిక, రాధిక అన్నారు, ఈ సినిమాతో ఇప్పుడు చిత్ర, చిత్ర అని పిలుస్తున్నారు. మణిశర్మ (ManiSharma) గారు ఇచ్చిన ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ముందే చెప్పాను, అలాగే అదే హైలైట్ అయింది.

ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన మాటలు కూడా చెప్పాడు కార్తీక్ గుమ్మకొండ. 'ఆర్ఎక్స్ 100' అప్పుడు కార్తీక్ వాళ్ళ అమ్మగారు అమెరికా వెళ్లారు, అక్కడ ఉంటున్న కార్తీక్ సిస్టర్ దగ్గరకి. అప్పుడు అమ్మ అమెరికాలో వెళ్ళినప్పుడు ఆ హిట్ వచ్చింది, ఇప్పుడు అయిదేళ్ల తరువాత హిట్ కోసం పరితపిస్తున్న కార్తీక్ కి వాళ్ళ అమ్మగారు మళ్ళీ అమెరికాలో వున్న అక్క దగ్గరికి వెళుతున్న, నీకు హిట్ వస్తుంది అని చెప్పి వెళ్లారట. ఈ మాటలు సరదాగా చెపుతూ కార్తిక్ తన తదుపరి సినిమా నిర్మాతకి రిక్వెస్ట్ చెయ్యాలి, సినిమా విడుదలకి ముందు అమ్మకి అమెరికా వెళ్లి రావటానికి ఒక టికెట్ బుక్ చెయ్యమని. ఇలా అమ్మ అమెరికా వెళితే అతని సినిమా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ తన తదుపరి సినిమా కి కూడా కంటిన్యూ చేస్తారేమో చూడాలి.

Updated Date - 2023-08-30T17:37:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!