Bedurulanka 2012 - OTT : ఓటీటీలో సడెన్ సర్‌ప్రైజ్!
ABN, First Publish Date - 2023-09-22T11:43:43+05:30
‘ఆర్‌ఎక్స్ 100’ (RX 100) ఫేం కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’ (beduru lanka 2012). కార్తికేయ సరసన నేహాశెట్టి కథానాయుకగా నటించారు. యుగాంతం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహించారు.
‘ఆర్‌ఎక్స్ 100’ (RX 100) ఫేం కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’ (beduru lanka 2012). కార్తికేయ (karthikeya) సరసన నేహాశెట్టి కథానాయుకగా నటించారు. యుగాంతం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహించారు. రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం నవ్వుల పంచింది. కానీ మిశ్రమ స్పందనకే పరిమితమైంది. ఇప్పుడు ఈ చిత్రం ఏ హడావిడి లేకుండా ఓటీటీలో దర్శనమిచ్చింది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా ఈ చిత్రం స్టీమింగ్ అవుతోంది. అయితే ఎలాంటి సమాచారం లేకుండా సినిమా స్ట్రీమింగ్ కావడంతో సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు.ఈ కథకు క్లాక్స్ దర్శకత్వం వహించారు. (Neha Shetty)
కథఫ డిసెంబర్-2012.. యుగాంతం జరగబోతుందంటూ ప్రచారం జోరు మీదున్న సమయమిది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల లంక గ్రామమైన బెదురులంక ప్రజల్లో ఈ యుగాంతపు భయాలు అప్పటికే మరింతగా నాటుకుపోయాయి. దీంతో ఆ భయాల్ని ఊరి ప్రజల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని అందర్నీ దోచేయాలని ఆ గ్రామంలో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే భూషణం (అజయ్ ఘోష్) ప్రణాళిక రచిస్తాడు . తన ప్లాన్ అమలు చేయడం కోసం బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్) అనే ఓ దొంగ బాబాను, డేనియల్ (రామ్‌ప్రసాద్) అనే ఫేక్ పాస్టర్‌ను పావులుగా ఎంచుకుంటాడు. వారి సహాయంతో ఊరి ప్రజల బంగారం మొత్తం కొల్లగొట్టడానికి ఓ ఎత్తుగడ వేస్తాడు. సరిగ్గా అదే సమయానికి సిటీలో ఉద్యోగం మానేసి ఊరిలోకి అడుగుపెడతాడు శివ (కార్తికేయ). తన మనసుకు నచ్చినట్లు బతికే డేనియల్, శివ, బ్రహ్మం, మాటల్ని అసలు లెక్కచేయడు. ఆ వ్యక్తిత్వంతోనే ఊరిని దోచేయాలన్న భూషణం ప్లాన్‌లకు ఎదురు నిలుస్తాడు. ఈ క్రమంలోనే తనెంతగానో ప్రేమించిన ఆ ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) కూతురు చిత్ర (నేహా శెట్టి)కి, పుట్టిన ఊరికి, కన్నవాళ్లకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. మరి ఆ తర్వాత ఏమైంది? యుగాంతం పేరుతో ఊరి ప్రజల్ని దోచేయాలనుకున్న ్ఘభూషణం కుట్రల్ని అతనెలా తిప్పి కొట్టాడు? అన్నది కథ.