సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bandla Ganesh: ‘దేవర’ నా టైటిల్‌.. కొట్టేశారు!

ABN, First Publish Date - 2023-05-19T17:13:16+05:30

బండ్ల గణేష్‌ వేదికపై మాట్లాడినా, ట్వీట్‌ చేసినా సంచలనమే! పవన్‌కల్యాణ్‌కు భక్తుడైన ఆయన గతంలో ‘దేవర’ అనే టైటిల్‌ రిజిస్టర్‌ చేయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండ్ల గణేష్‌ (Bandla ganesh) వేదికపై మాట్లాడినా, ట్వీట్‌ చేసినా సంచలనమే! పవన్‌కల్యాణ్‌కు (Pawan kalyan) భక్తుడైన ఆయన గతంలో ‘దేవర’ (Devara Title) అనే టైటిల్‌ రిజిస్టర్‌ చేయించారు. ఆ టైటిల్‌తో పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీయాలని బండ్ల కోరిక అని ఎన్నె సందర్భాల్లో చెప్పారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. కానీ పవన్‌కల్యాణ్‌ను మాత్రం ఆయన ‘దేవర’ అని పిలుచుకుంటుంటారు. ఇప్పుడు ఆ టైటిల్‌ను మరో సినిమాకు ఉపయోగిస్తున్నారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వహిస్తున్న ఎన్టీఆర్‌ 30 (ntr 30) చిత్రానికి ‘దేవర’ టైటిల్‌ను ఖాయం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు బండ్ల గణేశ్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

‘‘దేవర’ నేను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న నా టైటిల్‌. నేను మరచిపోవడం వల్ల నా టైటిల్‌ కొట్టేశారు’ అంటూ కోపంగా ఉన్న ఎమోజీని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ చేశాక దాని కాలపరిమితి మించిపోవడం, రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ చేసుకోకపోవడమే ‘దేవర’ టైటిల్‌ బండ్ల చేయి జారిందని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో జాన్వీకపూర్‌ టాలీవుడ్‌కి పరిచయం కానుంది. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

Updated Date - 2023-05-19T17:13:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!