Bandla Ganesh : ఏ కారణం లేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు .. అది తప్పు
ABN, First Publish Date - 2023-10-13T12:24:43+05:30
సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఆంధ్రప్రదేశ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిర్మాత బండ్ల గణేష్ ఖండించారు. భగవంతుడి దయవల్ల ఉన్నత స్థాయిలో ఉన్న మీరు ఓ పార్టీ అధినేత వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ సభలో వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు.
సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఆంధ్రప్రదేశ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిర్మాత బండ్ల గణేష్ ఖండించారు. భగవంతుడి దయవల్ల ఉన్నత స్థాయిలో ఉన్న మీరు ఓ పార్టీ అధినేత వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ సభలో వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయనొక వీడియో వదిలారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జగన్ ఏమన్నారంటే... "దత్తపుత్రుడి ఇల్లేమో హైదరాబాద్, ఇల్లాలేమో ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్‌నేషనల్.. ఆ తర్వాత ఏంటో నాకు తెలీదు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇలా మారుస్తు ఉంటాడు’ అని జగన్ అన్న మాటలకు బండ్ల గణేష్ ఆవేదనతో కౌంటర్ ఇచ్చారు.
"నిన్నటినుంచి మనసులో ఒకటే వేదన, బాధ. నాకెంతో ఇష్టమైన దైవ సమానుడైన పవన్ కల్యాణ్ గురించి జగన్ అభ్యంతరకర మాటలు మాట్లాడారు. జగన్ మీరు మంచి హోదాలో ఉన్నారు. ఎన్నో ఏళ్లగా పవన కల్యాణ్‌గారితో జర్నీ చేస్తున్న వ్యక్తిగా చెబుతున్నా. పవన్ కల్యాణ్ నిజాయితీ పరుడు, నీతివంతుడు, భోళా మనిషి. ఎవరు కష్టాల్లో ఉన్న ఆ కష్టం తనదిగా భావించి సహకరిస్తారు. ప్రతి వ్యక్తి జీవితం లో కొన్ని చెడు సంఘటనలు జరుగుతాయి. పవన్ గారి జీవితంలో కూడా ఆయన ప్రమేయం లేకుండా కొన్ని జరిగాయి. పవన్ గారిని విమర్శించటానికి ఏమి లేక ,వ్యక్తిగత విషయాలను పదే పదే మాట్లాడుతున్నారు. మీ వేదికలకు ఆయన వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన్ని ఎత్తి చూపడానికి ఏ కారణం లేక పదేపదే మీరు అతని వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడం కరెక్ట్ కాదని విన్నవిస్తున్నా. పవన్ కల్యాణ్ సమాజానికి ఉపయోగపడే మనిషి. ఆదయన సమాజకోసం బతుకుతున్న వ్యక్తి. హీరోగా కంఫర్టబుల్ లైఫ్‌ను వదులుకుని నిస్వార్థంగా ప్రజలకు మంచి చేయాలనే తపనతో పార్టీ నడుపుతున్నారు. ఆయన చేసే పని ఆలోచన నీతి నిజాయతీగా ఉంటాయి. జనాలె బావుండాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు. సినిమాలు చేసి సంపాదించిన సొమ్ముతో పార్టీ కోసం ఖర్చు చేసుకుంటున్నాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఎవరి దగ్గర ఏదీ ఆశించకుండా పార్టీ నడుపుతున్నాడు. ఆయనకు లేనిది ఒకటే కులాభిమానం. మనం భారతీయులం అంటాడాయన. ఆయనకు కుల పిచ్చి ఉంటే నన్ను ఇంత పెద్ద నిర్మాతను చేసేవాడా? ఈరోజు నేను అనుభవిస్తున్న స్టేటస్ మొత్తం పవనకల్యాణ్ పెట్టిన భిక్షే. తెలిసీ తెలియకుండా పవనకల్యాణ్‌లాంటి మహానుభావుడిపై అంబాడాలు వేయకంచి. ఈ సమయంలో కూడా నేను మాట్లాడకపోతే నా బతుకు ఎందుకు అనిపిస్తుంది. అందుకే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.