బాలయ్య ఏంది ఫాన్స్ ని కొడతాడంట, నితిన్ సినిమాలో బాలయ్య గురించి...
ABN, First Publish Date - 2023-11-27T18:13:26+05:30
'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్’ ట్రైలర్ విడుదలైంది. ఇది పూర్తి వినోదాత్మక చిత్రమని, ఇందులో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునే అంశాలు ఉన్నాయని, దర్శకుడు వక్కంతం మాటలతో ఆడుకున్నాడని కూడా అర్థం అవుతుంది. ఎక్స్‌ట్రా-ఆర్డినరీ గా వుంది ఈ ట్రైలర్.
నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్’ #ExtraOrdinaryMan ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకి వక్కంతం వంశీ (VakkanthamVamsi) దర్శకుడు, రచయిత. ఈ సినిమా డిసెంబర్ 8 న విడుదలవుతోంది. ట్రైలర్ ఎక్స్‌ట్రా - ఆర్డినరీ గా వుంది. సినిమా ఎంత ఎంటర్ టైనమెంటుగా ఉండబోతోందో దీనితో చెప్పేయొచ్చు. ఈ ట్రైలర్ చూస్తే చాలామంది నవ్వుకుంటూ వుంటారు, అంత ఎక్స్‌ట్రా-ఆర్డినరీ గా వినోదాత్మకంగా వున్నాయి ఒక్కో సన్నివేశం ఈ ట్రైలర్ లో.
ఇందులో బాలయ్య (NandamuriBlakarishna) ఫాన్స్ ని కొడతాడు అనే దాని మీద కూడా ఫన్ చేసాడు దర్శకుడు. "బాలయ్య ఫాన్స్ ని కొడతాడంట కదా," అంటూ వరలక్ష్మి అడిగితే నితిన్ దానికి, 'అవును కొడతాడు', అంటూ సమాధానం చెపుతాడు, మళ్ళీ ఆమె 'ఫాన్స్ ఫీలవరా' అంటే, 'ఫీలవుతారు' అనగానే ఆమె 'ఎట్టా' అని అనగానే సంగీతం మొదలవుతుంది. ఇలాంటివి చాలానే వున్నాయి, "ఇన్నాళ్లు గాల్లో మేడలో కడుతున్నారు అనుకున్నాను, ఇప్పుడు గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు' అంటూ రావు రమేష్ చెప్పే డైలాగు చాలా వున్నాయి ఒక్క ట్రైలర్ లోనే.
ఈ సినిమా మొత్తం వినోదాత్మకంగా ఉంటూ ప్రేక్షకులను నవ్విస్తుంది అని ట్రైలర్ చెప్పకనే చెపుతోంది. దర్శకుడు వక్కంతం వంశీ, తాజాగా అందరి నోటిలో నానుతున్న పదాలతో ఎక్కువగా ఆడుకున్నాడు అనిపిస్తోంది. 'పొయెటిక్ గా వుంది గానీ, పొన్నియన్ సెల్వన్ లాగా అర్థం అవటం లేదు నాన్నా' అంటూ నితిన్, రావు రమేష్ తో చెప్పే డైలాగ్ కూడా కడుపుబ్బా నవ్విస్తుంది.
చివరలో రాజశేఖర్, నితిన్ తో 'జీవితం చెప్పేది తప్ప, జీవితంలో ఎవరు ఏమి చెప్పినా వినను' అన్న డైలాగు చేపిత్, నితిన్ వెంటనే 'జీవిత సర్' అంటాడు, 'జీవితం.. అయినా నాకు రెండూ ఒకటే...' అంటూ రాజశేఖర్ చెప్పే డైలాగ్ కూడా అదిరింది. వక్కంతం నిజంగానే పదాలతో ఆదుకున్నాడు అనిపిస్తోంది. సినిమాలో నితిన్, రావు రమేష్, బ్రహ్మాజీ, రాజశేఖర్ ఇలా ఒకరేమిటి అందరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి అని తెలుస్తోంది. ఈ సినిమాకి నిర్మాతలు నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, అక్క నికిత రెడ్డి లు. హారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు.