కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Unstoppable With NBK: సుహాసినితో జ‌న్మ‌జ‌న్మ‌ల బంధం, శ్రీయ‌తో మిలీనియం బంధం

ABN, First Publish Date - 2023-12-14T18:58:43+05:30

బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా వ‌స్తున్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకేలో లిమిటెడ్ ఎడిష‌న్‌గా వస్తున్న షో తాజా ఎపిసోడ్ ప్రోమోను కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు.

Unstoppable With NBK

బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యాత‌గా వ‌స్తున్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే (Unstoppable With NBK)లో లిమిటెడ్ ఎడిష‌న్‌గా వస్తున్న షో తాజా ఎపిసోడ్ ప్రోమోను కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు. అల‌నాటి క‌థానాయిక‌ సుహ‌సిని, పాన్ ఇండియా హీరోయిన్‌ శ్రీయ‌, ద‌ర్శ‌కులు జ‌యంత్ సీ ప‌రాన్జీ (jayanth paranji), హ‌రీశ్ శంక‌ర్ పాల్గొనగా రూపొందించిన ప్రోమోను రిలీజ్ చేయ‌గా రేప‌టి నుంచి( డిసెంబ‌ర్ 15) నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయ‌నున్నారు.

నాది సుహాసినితో జ‌న్మ‌జ‌న్మ‌ల బంధం, శ్రీయ‌తో మిలీనియం బంధం అంటూ బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) చెప్ప‌డంతో ఈ ప్రోమో ప్రారంభమమైంది. ఆ త‌ర్వాత బాల‌కృష్ణ‌ను హ‌రీశ్‌క‌ల్యాణ్ బ్రో అంటూ సంబోధించ‌డం మిగ‌తా వారు రివ‌ర్స్‌లో ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం వంటి స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో నింపేశారు.


ఇప్ప‌టివ‌ర‌కు గెస్ట్‌లో ఎవ‌రైనా మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన‌ట్టుగా మాట్లాడ‌లేదా అని సుహాసిని అడ‌గ‌గా ఉన్నారు.. మీ వాడే అంటే హ‌రీశ్‌ను చూయించ‌డం ఆయ‌న ప‌వ‌న్ మ్యాన‌రిజం చూయించ‌డం, ఆ వెంట‌నే ఇంకా ఆప‌కుండా మాట్లాడిన గెస్ట్ ఎవ‌రంటే త‌డుముకోకుండా ర‌వితేజ అని చెప్ప‌డం ఇలా ఇంట్రెస్టింగ్ సంభాష‌ణ‌ల‌తో అద్యంతం ఫ‌న్నీగా సాగింది. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - 2023-12-14T19:07:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!