NandamuriBalakrishna: పాట పాడి అబ్బురపరిచిన బాలకృష్ణ, అభిమానులు అరుపులే అరుపులు
ABN, First Publish Date - 2023-05-06T12:25:42+05:30
నందమూరి బాలకృష్ణ మామూలు పాట కాదు, 'జగదేకవీరుని కథ' సినిమా లో అతి కష్టమైన 'శివశంకరి' పాటని అద్భుతంగా పాడి, అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు. ఇది దోహా పట్టణంలో తన తండ్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ఈవెంట్ లో పాడిన పాట
నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) గారి శత జయంతి ఉత్సవాలు ఒక్క భారతదేశం లోనే కాకుండా చాలా దేశాల్లో చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న దోహా పట్టణం లో ఈ ఉత్సవాలు జరిగాయి. దీనికి ఎన్టీఆర్ (NTR) తనయుడు బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా అటెండ్ అయ్యారు. ఈ ఫంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే బాలకృష్ణ పాట పాడటం. అయితే బాలకృష్ణ ఇంతకు ముందు పాడలేదా అని కాదు, పాడాడు, హుద్ హుద్ వచ్చినప్పుడు, చిత్ర పరిశ్రమ ఒక ఈవెంట్ చేసినప్పుడు అందులో పాడాడు బాలకృష్ణ.
మళ్ళీ ఇప్పుడు దోహా (Doha) లో తన తండ్రి శత జయంతి ఉత్సవాల ఈవెంట్ లో ఒక పాట పాడి అదరగొట్టాడు. ఇంతకీ అయన పాడిన పాట ఇందులోదో తెలుసా? ఎన్టీఆర్ నటించిన 'జగదేకవీరుని కథ' (Jagadekaveerudi Katha) సినిమా నుండి 'శివశంకరి' పాటను. అప్పట్లో ఈ పాట చాలా పెద్ద హిట్, ఘంటసాల పాడారు.
సినిమాలో ఈ పాట రామ రావుగారు ఎదురుగా ఒకతను శిల అయిపోయి ఉంటే, అతను గానంతో ఈ శిలని ఎవరు కరిగిస్తారో, అప్పుడే మళ్ళీ మనిషిని అవుతాను అంటాడు. అప్పుడు రామారావుగారు ఈ పాటను పాడతారు, ఘంటసాల అద్భుతంగా పాడారు. ఇందులో చాలా గమకాలూ ఉంటాయి. అలాగే ఆ స్వరాలు కూడా పలకటం చాలా కష్టం. కానీ బాలకృష్ణ ఈ పాటని చాలా బాగా పాడి వినిపించాడు. అక్కడ వున్న ప్రేక్షకులు అయితే అరుపులు కేకలతో, స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.