Balagam: పాత రోజులు మళ్ళీ వచ్చాయి...
ABN, First Publish Date - 2023-03-30T15:18:00+05:30
పాత రోజులు మళ్ళీ వచ్చాయి అన్నట్టుగా తెలంగాణలోని చాలా గ్రామాల్లో 'బలగం' సినిమాని ప్రదర్శిస్తున్నారు. గ్రామంలోని ప్రజలందరూ ఓ.టి.టి. లో వస్తున్నా ఈ సినిమాని ఒక కూడలి దగ్గర కూర్చొని చూస్తున్నారు. ఈ సినిమా తెలంగాణ పల్లె నేపథ్యంలో సాగే కథ.
కొన్ని దశాబ్దాల కిందట తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో రాత్రి బదులు ఉండేవి. వయోజన విద్య అని ఆ గ్రామం లో వుండే స్కూల్ ఉపాధ్యాయులు ఆ గ్రామం లో వున్నా రైతులకు, అలాగే చదువురాని ఇతరులకు రాత్రి పూత విద్య బోధిస్తూ ఉండేవారు. అదేదో వాళ్ళు ఆంగ్లం, తెలుగు అన్నీ నేర్చేసుకొని ఎదో చేస్తారని కాదు, చదవటం వస్తే చాలు అని నేర్పేవారు. ప్రజలు కూడా దానికి భారీగా వచ్చేవారు. అందులోనే అప్పుడప్పుడు ఒక తెల్లటి గుడ్డ, ప్రొజెక్టర్ తెచ్చి సినిమాలు కూడా వేసేవారు. గ్రామ ప్రజలు అందరూ వచ్చి కూర్చొని ఆ సినిమా చూసే సంతోష పడేవారు. కొందరు తమ కుర్చీలను తామే తెచ్చుకొని అక్కడ వేసుకొని చూసేవారు ఆ సినిమా.
ఇన్ని దశాబ్దాల తరువాత మళ్ళీ 'బలగం' (Balagam) సినిమా ఆ పాత రోజులని గుర్తు చేసింది. ఎలా అంటే, ఆ సినిమా ఒక గ్రామంలో స్క్రీనింగ్ వేశారు, ఆ గ్రామం లో వుండే వాళ్ళు, ముఖ్యంగా థియేటర్ కి రాలేని పెద్దవాళ్ళు వచ్చి ఆ సినిమా చూసారు. ఇది నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలంలో ఆశ కొత్తూర్ లో ఇలా సినిమా వెయ్యటం జరిగింది. ఈ సినిమా వేసేటప్పుడు ఆ గ్రామ ప్రజలు మొత్తం ఒక్క దగ్గర కూడీ ఈ 'బలగం' చూసారు.
తెలంగాణ పల్లె జీవనానికి అడ్డం పెట్టె విధంగా ఈ 'బలగం' (BalagamFilm) సినిమా ఉంటుంది. వేణు యెల్ధండి (Venu Yeldandi) 'జబర్దస్త్' (Jabardasth) కామెడీ షో తో బాగా పేమస్ అయ్యాడు. ఇప్పుడు మొదటి సారిగా దర్శకత్వం చేపట్టి ఈ 'బలగం' అనే ఒక భావోద్వేగ సినిమా చేసాడు. ఇది చాలా పెద్ద హిట్ అయింది కూడా. ఓ.టి.టి. లో కూడా పెద్ద హిట్, ఓ.టి.టి. లో వస్తున్నా కూడా థియేటర్ కి జనాలు బాగా వస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అని మొదలు పెట్టి తన కూతురు హన్షిత రెడ్డి, అన్న కొడుకు హర్షిత్ రెడ్డి లను నిర్మాతలుగా పరిచయం చేస్తూ ఈ సినిమా తీసాడు.
ఇప్పుడు ఈ 'బలగం' సినిమాని ఇలా గ్రామ పంచాయతీల ముందు, గ్రామంలో కూడళ్ల ముందు, పెద్ద పెద్ద స్క్రీన్ లు పెట్టి ఓ.టి.టి ఆమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో వస్తున్న 'బలగం' (BalagamFilm) చూస్తున్నరంటే అదేమీ మాములు విషయం కాదు. అప్పట్లో కరెంట్ ఉండటమే కష్టం, కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కదా, అందుకని పెద్ద టీవీ లు పెట్టి చూపిస్తున్నారు. అయినా ఇలా చూస్తూ ఉంటే, మళ్ళీ ఆ పాత రోజులు వచ్చాయా అని అనిపిస్తోంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అనేది జగమెరిగిన సత్యం. ఈ సినిమా నిర్మాతలకు డబ్బులతో పాటు, దర్శకుడికి మిగతా వాళ్ళకి అందరూ ప్రశంసిస్తున్నారు. మళ్ళీ దిల్ రాజు (Dil Raju) ఇలాంటి సినిమా తీయగలడా అన్నట్టుగా అతన్ని, టీము ని ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.