సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Baby: కుమ్ముతున్న వసూళ్లు, చరిత్ర సృష్టించనుందా ?

ABN, First Publish Date - 2023-07-17T11:44:10+05:30

'బేబీ' సినిమా గురించే ఎక్కడ చూసిన మాట్లాడుకుంటున్నారని అని తెలిసింది. పరిశ్రమలో కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఏంటి ఇంతలా కుమ్ముతోంది అని అనుకుంటున్నారు. ఇక మూడురోజులకు గాని ఈ సినిమా రూ 23.5 కోట్ల గ్రాస్ కలెక్టు చేసి చరిత్ర సృష్టించే దిశగా వెళుతోందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. సాయి రాజేష్ దర్సకతవం వహించిన ఈ సినిమాకి ఎస్ కె ఎన్ నిర్మాత.

A still from the film Baby
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయి రాజేష్ #SaiRajesh దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ (AnandDeverakonda), విరాజ్ అశ్విన్ (VirajAswin), వైష్ణవి చైతన్య (VaishnaviChaitanya) నటించిన ప్రేమ కథా చిత్రం 'బేబీ' #Baby గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదటి షోకి కొంచెం డివైడ్ టాక్ వచ్చినా, మొదటి రోజు పూర్తయ్యేసరికి ఈసినిమా ఒక కల్ట్ లవ్ స్టోరీ సినిమాగా ప్రతివాళ్ళచేత ప్రసంశలు పొందింది. ఎక్కడ చూసిన ఇప్పుడు 'బేబీ' #BabyTheMovie సినిమా గురించే మాట్లాడుతున్నారు. సాయి రాజేష్ రచన, ఇందులో మాటలు ఒక ఎత్తు అయితే, ఆనంద్, విరాజ్, వైష్ణవి ల నటన ఇంకో ఎత్తు ఈ సినిమా విజయానికి. ఈ సినిమాకి ఎస్ కె ఎన్ నిర్మాత.

విజయ్ బుల్గానిన్ (VijayBulganin) అందించిన సంగీతం ఈ సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణ అయింది. ఇలా ఈ సినిమాకి అన్ని సరిగ్గా కుదరడంతో ఈ చిన్న సినిమా ఒక పెద్ద విజయానికి చరిత్ర సృష్టించే దిశగా వెళుతోంది. మొదటి రోజు కలెక్షన్స్ కన్నా, రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉంటే, ఈ రెండు రోజులకన్నా మూడో రోజు ఇంకా ఎక్కువ కలక్షన్స్ కలెక్టు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

ఈ సినిమా మూడు రోజులకు గాని మొత్తం రూ. 23.5 కోట్ల గ్రాస్ కలెక్టు చేసిందని చెపుతున్నారు. అంటే ఒక చిన్న సినిమా ఇంత కలెక్టు చెయ్యడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్ర రావు (KRaghavendraRao) లాంటి దర్శకుడు ఈ సినిమా చూసి తన సోషల్ మీడియా లో ఎంతో ప్రశంసించారు అంటే సినిమాలో విషయం వుంది అని అర్థం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం విడుదల అయ్యే సినిమాల్లో ఈ చిన్న సినిమా కలెక్షన్ల సునామీల్లో చరిత్ర సృష్టించినా మనం అస్కేర్యపోనక్కరలేదు అని కూడా అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ లాభాల బాటల్లో వున్నారు అని కూడా అంటున్నారు.

బేబీ సినిమా మూడు రోజుల సరాసరి కలెక్షన్స్

నైజాం రూ. 8,56,50,706

వైజాగ్ రూ 2,82,56,239

ఈస్ట్ రూ.1,38,06,945

వెస్ట్ రూ. 83,00,334

కృష్ణ రూ. 1,33,22,572

గుంటూరు రూ.1,08,04,046

నెల్లూరు రూ. 69,56,210

సీడెడ్ రూ. 2,09,11,880

కర్ణాటక + రెస్ట్ అఫ్ ఇండియా రూ. 77,93,808

ఓవర్సీస్ రూ.3,94,00,000

మొత్తం: రూ. 23,52,02,740

Updated Date - 2023-07-17T11:44:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!