Ram Charan Upasana: మెగా వారసురాలు పుట్టింది, తల్లిదండ్రులు అయిన చరణ్, ఉపాసన
ABN, First Publish Date - 2023-06-20T05:56:57+05:30
మెగా కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ వచ్చింది. ఉపాసన మంగళవారం తెల్లవారుజామున పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఇద్దరూ క్షేమంగా వున్నారని, మెగా కుటుంబంలో అందరూ సంతోషంగా రామ్ చరణ్ దంపతులకి విషెస్ చెప్తున్నారు. కొత్తగా పుట్టిన అమ్మాయిని చూడటానికి ఈరోజు వస్తున్నారు.
పవర్ కపుల్ అని పిలవబడుతున్న రామ్ చరణ్ (RamCharan), ఉపాసన కామినేని కొణిదెల (UpasanaKamineni) కి పండంటి పాపాయి పుట్టింది. సోమవారం సాయంత్రం ఉపాసన కామినేని అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె వెంట, భర్త రామ్ చరణ్, అత్తగారు సురేఖ, ఆమె మదర్ అందరూ వెంట రాగ నిన్న రాత్రి అపోలో హాస్పిటల్ లో చేరిన ఉపాసన ఈరోజు అంటే మంగళవారం తెల్లవారుజామున పండంటి పాపాయికి జన్మ ఇచ్చిందని ఆసుపత్రి ఒక ప్రత్యేక మెడికల్ బులెటిన్ విడుదల చేసింది.
ఇటు మెగా కుటుంబంలో, అటు కామినేని కుటుంబంలో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్ తన కూతురిని చూసి మురిసిపోయాడని అతని సన్నిహితులు చెప్పారు. ఈరోజు రెండు కుటుంబాల కి చెందిన సభ్యులు ఆసుపత్రికి వచ్చి రామ్ చరణ్, ఉపాసనలకి అభినందనలు తెలుపుతూ, అలాగే పుట్టిన పాపాయికి ఆశీర్వచనములు కూడా చెపుతారని మెగా ఫామిలీ టీం ఒక ప్రకటనలో తెలిపింది.
గత కొన్ని రోజుల నుండి రామ్ చరణ్, ఉపాసన లు వార్తలే ఎక్కడ చూసిన వైరల్ అయ్యాయి. ముందుగా ఉపాసన డెలివరీ డేట్ జులై అనుకున్నారు, కానీ తరువాత జూన్ 20 అని కన్ఫర్మ్ చేశారు, నిన్న ఆసుపత్రి లో జాయిన్ అయ్యారు. అపోలో హాస్పిటల్ లో ఉపాసన కోసమని ఒక ప్రత్యేక రూమ్ సిద్ధం చేసి ఉంచారు.
ఉపాసన, పుట్టిన పాపాయి ఇద్దరూ ఆరోగ్యాంగా వున్నారు అని సన్నిహితులు చెప్పారు. ఉపాసన మొదటి నుండీ కూడా చాలా కేర్ తీసుకుంది, డాక్టర్ల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యాన్ని చూస్తూ ఉండేవారు. అలాగే ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరూ ఈమధ్య చాలా ప్రాంతాలు తిరిగారు, అందులో ముఖ్యంగా ఆస్కార్ అవార్డు అందుకోవడానికి అమెరికా వెళ్ళినప్పుడు ఎక్కడ చూసిన ఈ ఇద్దరే కనపడేవారు.
మెగా స్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi) రాత్రి రామ్ చరణ్ తో మాట్లాడి తన సంతోషాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అలాగే రామ్ చరణ్ మదర్ సురేఖ హాస్పిటల్ లోనే వున్నారు, ఆమె కూడా ఎంతో సంతోషంగా వున్నారు అని తెలిసింది. మనవరాలిని ఆమె చూసి ఎంతో మురిసిపోయినట్టుగా సన్నిహితులు చెపుతున్నారు.