Baby team visit: మీడియాపై దాడి అని వస్తున్న వార్తలపై 'బేబీ' నిర్మాత వివరణ
ABN, First Publish Date - 2023-08-04T15:32:16+05:30
భీమవరంలో 'బేబీ' టీము మీడియాపై దాడి చేసిని అనే వార్తలు సాంఘీక మాధ్యమంలో వచ్చాయి. అయితే అక్కడ అసలు ఏమి జరిగింది ఆ వార్తల్లో ఎంత నిజం వుంది, వాటిపై ఆ సినిమా నిర్మాత వివరణ ఇచ్చాడు.
ఈమధ్య విడుదలైన చిన్న సినిమాలలో 'బేబీ' #Baby సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల క్లబ్ (100 crore club) లో కూడా చేరబోతోంది. అంతటి ఘన విజయం అందుకున్న ఈ చిన్న సినిమాకి దర్శకుడు సాయి రాజేష్ (SaiRajesh) కాగా, ఎస్.కె.ఎన్ (SKN) నిర్మాత. ఇందులో ఆనంద్ దేవరకొండ (AnandDeverakonda), వైష్ణవి చైతన్య (VaishnaviChaitanya), విరాజ్ అశ్విన్ (VirajAswini) లు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ముగ్గురి మధ్య నడిచే ప్రేమ కథా చిత్రం.
ఈ సినిమా మొదటి షో నుండి మంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ అదిరిపోయేట్టుగా మొదటి రోజు నుండే వున్నాయి. ఒక పెద్ద సినిమాకి కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఆలా కలెక్టు చేసింది ఈ సినిమా. విడుదలై 20 రోజులు అయినా ఈ సినిమా టీము ప్రచారాలు ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు మళ్ళీ రెండోసారి మొదలెట్టాయి.#BabyMovie ఆలా నిన్న రాజమండ్రి, ఈరోజు భీమవరం థియేటర్స్ ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్, నిర్మాత పర్యటించారు.
ఇలా పర్యటనలో వున్నప్పుడే భీమవరంలో ఒక సంఘటన జరిగింది. ఈరోజు భీమవరంలో #Bhimavaram ఒక థియేటర్ ని ఈ 'బేబీ' టీం సందర్శించింది. సినిమా వాళ్ళు వస్తున్నారు అంటే మామూలుగానే ప్రేక్షకులు ఎక్కువగా వస్తారు చూడటానికి. అలాంటిది జనాలు చాలా ఎక్కువమంది వచ్చారు ఈ టీముని చూడటానికి. అందులో లోకల్ మీడియా వాళ్ళు కూడా వున్నారు. "జనం విపరీతంగా వచ్చి మీద పడిపోతున్నారు. అలాంటి సమయంలో బౌన్సర్లు ముందుగా మా టీము వాళ్ళని సేవ్ చెయ్యడానికి చూస్తారు. ఎందుకంటే అంత క్రౌడ్ ఒక్కసారిగా మీద పడితే మామూలుగా ఉండదు కదా. అందుకని బౌన్సర్లు అలా వచ్చిన క్రౌడ్ ని కొంచెం నెట్టారు, అంతే," అని చెప్పాడు నిర్మాత ఎస్.కె.ఎన్. అయితే అందులోనే ఒక లోకల్ మీడియా పర్సన్ కూడా ఉండటంతో అతన్ని బౌన్సరు చూసుకోలేదు. అతను మొబైల్ తో వీడియో తీసుకుంటూ ఉంటే మామూలు పర్సన్ అనుకున్నాడు బౌన్సర్. ఎందుకంటే లోకల్ మీడియా పర్సన్ అయితే కెమెరా పట్టుకొని వస్తారు అన్న భావంతో, అందుకని క్రౌడ్ తో పాటు అతన్ని కూడా నెట్టేశాడు. (Baby producer clarifies about attack on media in Bhimavaram)
ఆలా నెట్టడంలో ఆ మీడియా పర్సన్ కింద పడిపోగానే, అక్కడ వున్న కొందరు మీడియా మీద దాడి అంటూ వెంటనే విమర్శలు మొదలెట్టేసారు. కొందరు వచ్చి ఈ టీము ప్రయాణిస్తున్న కారును కదపనియ్యం అంటూ కారు ముందు కూర్చున్నారు. అప్పుడు నిర్మాత ఎస్.కె.ఎన్ కారు దిగి వాళ్ళ దగ్గరకి వెళ్లి, తాను కూడా 15 ఏళ్లకు పైగా మీడియాలో పని చేసానని, మీడియా అంటే ఎప్పుడూ తనకు గౌరవం అని, ఈ సంఘటన యాదృచ్చికంగా జరిగిన సంఘటన అని చెప్పి అక్కడ వాళ్ళకి సర్ది చెప్పాడు. అదే సమయంలో లోకల్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. పరిస్థితి చక్కబడిన తరువాత ఆ పడిపోయిన మీడియా పర్సన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాడు కూడా. ఎక్స్ రే లు కూడా తీయించారు, డాక్టర్స్ అతనికి ఏమీ కాలేదు, అతను బాగున్నాడు అని చెప్పారు. ఆర్ధికంగా సహాయం చెయ్యాలా, మెడిసిన్స్ కి ఏమైనా కావాలన్నా ఇస్తాము అని చెప్పినా, అతను నాకేమి కాలేదు, ఏమి అవలేదు ఏమీ వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత ఆ బౌన్సర్ తో సారీ కూడా చెప్పించారు. ఇది అక్కడ జరిగిన సంఘటన అని 'బేబీ' టీం వివరణ ఇచ్చింది. అంతే అక్కడ మీడియా వాళ్ళమీద కావాలని దాడి జరగలేదు, అలాగే ఇంకెటువంటి సంఘటన జరగలేదు అని తెలిపింది చిత్ర బృందం. (#Baby team explains about the incident happaned at Bhimavaram)