సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ashu reddy: అందువల్లనే నా ఫోన్‌ వాడలేకపోతున్నా!

ABN, First Publish Date - 2023-06-27T10:57:02+05:30

డ్రగ్స్‌ కేసులో (Drugs Case) అరెస్ట్‌ అయిన నిర్మాత కేపీ చౌదరి (Kp Chowdary) వ్యవహారంలో తన పేరు బయటకి రావడంపై నటి అషురెడ్డి (Ashu Reddy) మరోసారి స్పందించింది. గత వీడియోలో కూడా ఆమె గరమ్‌గా మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు అందరి జాతకాలు బయటపెడతా అని హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డ్రగ్స్‌ కేసులో (Drugs Case) అరెస్ట్‌ అయిన నిర్మాత కేపీ చౌదరి (Kp Chowdary) వ్యవహారంలో తన పేరు బయటకి రావడంపై నటి అషురెడ్డి (Ashu Reddy) మరోసారి స్పందించింది. గత వీడియోలో కూడా ఆమె గరమ్‌గా మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు అందరి జాతకాలు బయటపెడతా అని హెచ్చరించారు. తాజాగా తనపై ట్రోలింగ్‌ ఎక్కువ కావడంతో మరోమారు ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

‘‘డ్రగ్స్‌ కేసుకు, నాకు ఏ సంబంధం లేకపోయినా కొన్ని మీడియా చానళ్లు నన్ను కించపరిచేలా వార్తలు రాస్తున్నాయి. కేపీ చౌదరి కాల్‌ డేటాలో నా పేరు, ఫోన్‌ నంబర్‌ ఉండడంతో నా నంబర్‌ను టెలికాస్ట్‌ చేశాయి. దీంతో నేను మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా నంబర్‌ బయటపెట్టడం వల్ల నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. దీని వల్ల ఇప్పుడు నా నంబర్‌ ఉపయోగించలేకపోతున్నా. నన్ను కించపరిచేలా వార్తలు వండిన ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తా. కేపీ చౌదరితో గంటల సమయం ఫోన్‌ మాట్లాడానని చెబుతున్నారు. అతడితో నాకున్న పరిచయం, ఫోన్‌ కాల్స్‌పై నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇది కేసు బయటికి వచ్చినప్పుడు నేను ఇండియాలో లేను. నేను ఇక్కడ లేకపోయినా, ఆ కేసుకు నాకు సంబంధం లేకపోయినా కేవలం నా ఫోన్‌ నంబర్‌ అతని దగ్గర ఉందనే కారణంగా ఆరోపణలు చేస్తున్నారు. అందుకే ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నా’’ అని అషురెడ్డి పేర్కొంది.

Updated Date - 2023-06-27T10:58:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!