కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ashish Reddy : దిల్‌ రాజు ఇంట త్వరలో పెళ్లి బాజాలు!

ABN, First Publish Date - 2023-12-01T11:44:37+05:30

నిర్మాత దిల్‌ రాజు ఇంట త్వరలోనే పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఆయన సోదరుడు, నిర్మాత శిరీష్‌ తనయుడు హీరో ఆశిష్‌ రెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశకు చెందిన అద్విత రెడ్డి అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకోనున్నారు.

నిర్మాత దిల్‌ రాజు (Dil raju) ఇంట త్వరలోనే పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఆయన సోదరుడు, నిర్మాత శిరీష్‌ తనయుడు హీరో ఆశిష్‌ రెడ్డి (Asish Reddy) ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశకు చెందిన అద్విత రెడ్డి అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకోనున్నారు. గురువారం వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.

అద్విత తండ్రి వ్యాపారవేత్త అని తెలుస్తోంది. వీరిద్దరి వివాహాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్లాన్‌ చేశారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఆశిష్‌ ‘రౌడీబాయ్స్‌’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. విశాల్‌ కాశీ దర్శకత్వంలో నటిస్తున్న ‘సెల్ఫిష్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ‘లవ్‌టుడే’ ఫేమ్‌ ఇవానా కథానాయికగా కనిపించనుంది.

Updated Date - 2023-12-01T11:45:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!