సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rajasekhar: మాన్‌స్టర్‌ గా మారిన యాంగ్రీ మాన్

ABN, First Publish Date - 2023-02-02T12:29:24+05:30

యాంగ్రీ యంగ్ మాన్ గా, సూపర్ పోలీస్ గా చాలా సినిమాల్లో కనిపించిన నటుడు రాజశేఖర్ (Actor Rajasekhar) ఈసారి ఇంకో కొత్త అవతారం ఎత్తనున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాంగ్రీ యంగ్ మాన్ గా, సూపర్ పోలీస్ గా చాలా సినిమాల్లో కనిపించిన నటుడు రాజశేఖర్ (Actor Rajasekhar) ఈసారి ఇంకో కొత్త అవతారం ఎత్తనున్నారు. పవన్ సాధినేని (Pavan Sadhineni) దర్శకత్వం లో రాజశేఖర్ సినిమా అధికారికంగా లాంచ్ అయింది, కానీ షూటింగ్ మాత్రం ఎల్లుండి అంటే ఫిబ్రవరి 4, రాజశేఖర్ పుట్టినరోజున మొదలుపెడుతున్నారు. ఈ సినిమాకి ఒక ఆసక్తికర టైటిల్ ని కూడా పెట్టారని తెలిసింది. దీనికి 'మాన్‌స్టర్‌' (Monster) అని పేరు పెట్టారు. ఇది ఒక కంప్లీట్ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. అయితే రాజశేఖర్ ఈ సినిమాలో ఎందుకు మాన్‌స్టర్‌ గా మారవలసి వచ్చిందో, ఏమయిందో అనే దాని మీద కథ ఉంటుందని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 4 నుండి మొదలవుతుందని కూడా తెలిసింది.

ఇది రాజశేఖర్ కి 92వ సినిమా అవుతుంది. సుమారు 37 సంవత్సరాలు పైగా అయింది రాజశేఖర్ తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టి. దర్శకుడు టి. కృష్ణ (T.Krishna) తన సినిమా 'ప్రతిఘటన' తో రాజశేఖర్ ని తెలుగు కి పరిచయం చేశారు. అప్పటి నుండి రాజశేఖర్ తనదైన మార్కు వేసుకొని సినిమా రంగం లో కొనసాగుతూ, ముఖ్యంగా పోలీస్ పాత్ర అనగానే రాజశేఖర్ గుర్తుకు వచ్చేలా ఆ పాత్రలను అంత చక్కగా అభినయించేవారు. ఇప్పుడు 92వ సినిమా 'మాన్‌స్టర్‌' ఇంకో రెండు రోజుల్లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా కంటిన్యూ గా షూట్ చేసి ఈ సంవత్సరం వేసవిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు భోగట్టా.

Updated Date - 2023-02-02T12:29:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!