Anchor Sowmya rao: నా ప్రయత్నాలు - ప్రార్థనలు విఫలమయ్యాయి!
ABN, First Publish Date - 2023-05-21T16:55:30+05:30
టీవీ సీరియళ్లతో గుర్తింపు పొందిన సౌమ్య రావు జబర్దస్త్ యాంకర్‌గా కూడా రాణిస్తోంది. వచ్చీ రాని తెలుగుతో క్యూట్ మాటలతో షోలో ఎంతో చలాకీగా కనిపించే ఆమె వ్యక్తిగతంగా ఎంతో బాధ అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.
టీవీ సీరియళ్లతో గుర్తింపు పొందిన సౌమ్య రావు (Sowmya rao) జబర్దస్త్ యాంకర్‌గా (Jabardast anchor) కూడా రాణిస్తోంది. వచ్చీ రాని తెలుగుతో క్యూట్ మాటలతో షోలో ఎంతో చలాకీగా కనిపించే ఆమె వ్యక్తిగతంగా ఎంతో బాధ అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. సౌమ్య తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూశారు. చివరి రోజుల్లో తన తల్లి ఎదుర్కొన్న నరకం గురించి వివరిస్తూ ఇటీవల ఓ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సౌమ్య రావు ఆస్పత్రి బెడ్ మీద ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ తనను నవ్వించేందుకు ప్రయత్నించింది. తన తల్లి అనుభవించిన నరకం ఏ తల్లికీ రాకూడదని భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘అంబులెన్స్, డాక్టర్స్.. ట్రీట్‌మెంట్.. మందులు ఎంతో బాధ అనుభవించావు. నీ కోసం ఆ దేవుడికి ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు చేశాను. అయినా ఆ దేవుడు కరుణించలేదు. భగవంతుడు నాకెందుకు ఇలా చేశాడని బాధ కలుగుతోంది. అందరూ అమ్మ ఫోటో షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడ్డ బాధ గుర్తొస్తోంది. దానిని నేను మర్చిపోలేకపోతున్నాను. రాత్రింబవళ్లు నీకు సేవ చేసినా, భగవంతుడికి పూజ చేసినా అన్నీ వృథా అయ్యాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్తిగా మిగిలింది. ప్రతిరోజు, ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను. అమ్మా, నాకోసం మళ్లీ పుడతావని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను. దేవుడా.. మా అమ్మానాన్నలను మళ్లీ నాకివ్వు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. (Sowmya rao mother expired)