సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anasuya Request: స్వశక్తితో ఎదిగాను.. దయచేసి నన్ను లాగొద్దు!

ABN, First Publish Date - 2023-06-19T18:14:14+05:30

‘నేను స్వశక్తితో ఎదిగిన మహిళను. నన్ను ప్రశంసించలేకపోయినా, ప్రోత్సహించలేకపోయినా దయచేసి నాకు దూరంగా ఉండండి’’ అంటూ విజ్ఞప్తి చేశారు నటి అనసూయ. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె ఈ మేరకు పోస్ట్‌ పెట్టి మళ్లీ వార్తల్లో నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నేను స్వశక్తితో ఎదిగిన మహిళను. నన్ను ప్రశంసించలేకపోయినా, ప్రోత్సహించలేకపోయినా దయచేసి నాకు దూరంగా ఉండండి’’ అంటూ విజ్ఞప్తి చేశారు నటి అనసూయ(Anasuya Bharadwaj). సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె ఈ మేరకు పోస్ట్‌ పెట్టి మళ్లీ వార్తల్లో నిలిచారు. పది రోజుల క్రితం పెళ్లిరోజు సందర్భంగా భర్తతో థాయ్‌ల్యాండ్‌ విహారానికి వెళ్లిన ఆమె అక్కడి బీచ్‌లో బికినీ ధరించి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వైరల్‌ అయింది. మరీ హాట్‌గా ఉన్న ఆ ఫొటోల గురించి చాలామంది ట్రోల్‌ చేసినా ఆమె మాత్రం ఆ ఫొటోలు పోస్ట్‌ చేయడం ఆపలేదు. అందరి కళ్లూ మీదనే ఉన్నాయంటూనే టూర్‌ పూర్తయ్యాక ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చినట్లు మళ్లీ హాట్‌ ఫొటోలు షేర్‌ చేసింది. ‘‘టూర్‌లో నేను తీసిన ఏ ఫొటో మెమరీని వదలను. గడిపిన తీపి జ్ఞాపకాలను ఫిల్టర్‌ చేయాలని అనుకోను’’ అని పేర్కొంది. తాజాగా మరోసారి వరుస ట్వీట్లతో విజృంభించింది. (Anasuya Request)

‘‘అందరికీ నమస్కారం.. రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు వ్యక్తులను అగౌరపరచడం కోసం నా పేరును కొంతమంది ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ట్వీట్లు నాకు వచ్చాయి. అలా నా పేరును వాడడం నాకు అగౌరవంగా ఉంది. నాకు నచ్చిన విధంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నా. నేను ఎవరి జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే అది అనవసరమైన బాధ కలిగిస్తుందని ఈ మధ్యనే గమనించా. నేను స్వశక్తితో ఎదిగిన మహిళని. నా గురించి గొప్పగా చెప్పేందుకు నాకు పి.ఆర్‌గానీ ఇతరులుగానీ లేరు. మీరు నన్ను ప్రశంసించలేకపోతే, ప్రోత్సహించలేకపోతే కనీసం నాకు దూరంగా ఉండండి. సక్రమ మార్గంలో మార్పు తీసుకొచ్చేందుకు, ఆ మార్గంలో నడిచేందుకు నేను ఇక్కడ ఉన్నా. నాకూ ఓ కుటుంబం ఉంది.. ప్లీజ్‌’’ అంటూ వరుస ట్వీట్లు చేశారు. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు.. ‘మళ్లీ ఏమైంది మేడమ్‌?’, ‘ఏం జరిగింది?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2023-06-19T20:43:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!