Anasuya: పొగరు.. ధైర్యంతో చూశా.. కానీ!
ABN, First Publish Date - 2023-03-22T11:51:52+05:30
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ వేదికపై భావోద్వేగానికి లోనయ్యారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’ చిత్రం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్(anasuya) వేదికపై భావోద్వేగానికి లోనయ్యారు. కృష్ణవంశీ (krishna vamsi) దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’ 9Rangamarthanda) చిత్రం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ‘‘సినిమా ప్రమోషన్స్ విషయంలో కంగారు పడి తరచూ కృష్ణవంశీకి కాల్ చేేసదాన్ని. సర్.. ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టలేదు ఎలా? సర్ అని అడగ్గా.. ‘మన సినిమా మాట్లాడుతుంది.. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని సమాధానం ఇచ్చేవారు. ఈ క్షణం చాలా ఎమోషనల్‌గా ఉంది. ‘రంగమార్తాండ’ వంటి గొప్ప సినిమాలో భాగం అయ్యాను. నా జీవితానికి ఇది చాలు. సోమవారం ఈ సినిమా చూశాను. అక్కడే ఆగిపోయాను. సినిమాలో నటించాను కదా.. సినిమా చూస్తునప్పుడు అంత ఎమోషనల్ కానులే అనుకుని ధైర్యం, పొగరుగా వెళ్లి షోలో కూర్చొన్నాను. ఉన్నట్టుండి కన్నీరు ఆగలేదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది’’ అని ఆమె అన్నారు. (Anasuya Emotional)
2017లో ఆయన తీసిన ‘నక్షత్రం పరాజయం పాలైంది. ఐదేళ్ల విరామం తర్వాత కృష్ణవంశీ నుంచి వచ్చిన చిత్రమిది. మరాఠీలో విజయవంతం అయిన ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా తెరకెక్కింది. అంతరించుపోతోన్న నాటకరంగం, దానివల్ల రంగస్థల నటులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనే అంశంతో ఈ చిత్రం రూపొందింది. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించగా.. శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, అలీ రెజా ఇతర పాత్రల్లో నటించారు. ఉగాది సందర్భంగా బుధవారం ఈ చిత్రం విడుదలైంది.