Anasuya Bharadwaj: ఇంతకీ అనసూయ ఫొటో ప్రయోగం ఏంటంటే..!
ABN, First Publish Date - 2023-08-14T22:04:10+05:30
అనసూయ అంటే హాట్నెస్. సోషల్ మీడియా ఆమె పోస్ట్ చేసే ఫొటోలు అలా ఉంటాయి మరి. ఆ ఫొటోలకు లెక్కలేనంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో విదేశీ విహారాల్లో ఆమె తీసుకున్న ఫొటోలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే! అయితే తాజాగా అనూ పోస్ట్ చేసిన ఫొటో చూస్తే షాక్ అవుతారు. ఈసారి గుర్తు పట్టలేనంత డిఫరెంట్ ఫొటో షేర్ చేసింది. అసలు ఆ ఫొటోలో ఉన్నది ఎవరా అని అనుకున్నారు.
అనసూయ (Anasuya) అంటే హాట్నెస్. సోషల్ మీడియా ఆమె పోస్ట్ చేసే ఫొటోలు అలా ఉంటాయి మరి. ఆ ఫొటోలకు లెక్కలేనంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో విదేశీ విహారాల్లో ఆమె తీసుకున్న ఫొటోలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే! అయితే తాజాగా అనూ పోస్ట్ చేసిన ఫొటో చూస్తే షాక్ అవుతారు. ఈసారి గుర్తు పట్టలేనంత డిఫరెంట్ ఫొటో షేర్ చేసింది. అసలు ఆ ఫొటోలో ఉన్నది ఎవరా అని అనుకున్నారు. అసలు విషయం తెలిసి రిలాక్స్ అయ్యారు. ఇంతకీ అనసూయ ఏ గెటప్‌లో కనిపించారంటే... స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె ఓ యోధురాలిని గుర్తు చేసుకున్నారు. ఆమె వేషధారణలోకి అనసూయ మారిపోయింది. ఆమె గురించి పలు వివరాలు తెలిపింది. ఆమె ఎవరో కాదు.. ‘1857 కాలం నాటి స్వాతంత్య్ర సమరయోధురాలు ఆవాదీ క్వీన్ బేగం హజ్రత్ మహల్(Begum Hazrat Mahal). ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆమె పోరాటాన్ని గుర్తు చేసుకుందాం’ అని అనసూయ పోస్ట్ పెట్టింది. (Independence Day)
‘‘1857లో బ్రిటీషర్స్కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొని కోట్లాది మంది భారతీయులు అమరులయ్యారు. ఆ ఉద్యమంలో మగాళ్లతోపాటు ఆడవాళ్లు కూడా ఉన్నారు. వారితో బేగం హజ్రత్ మహల్ ఒకరు. తొలి మహిళా పోరాట యోధురాలుగా కూడా ఆమె గురించి చెబుతారు. స్వాతంత్ర పోరాటాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారామె! బ్రిటీష్ పాలనకు సవాల్ విసురుతూ రెండు దశాబ్దాలపాటు పోరాటం చేసి దేశ సేవకై ఆమె జీవితాన్ని అంకితం చేసింది. దేశం కోసం పోరాడినందుకు 1984 మే 10న ప్రభుత్వం ఆమె ఫొటోతో స్టాంప్ విడుదల చేసింది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ పోరాట యోధురాలిని గుర్తు చేసుకుందాం’’ అని అనసూయ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే అనసూయ వాల్ మీద ఇలాంటి ఫొటో చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. దీనిని పాజిటివ్‌గా తీసుకుని ఇలాంటి మంచి పోరాట యోధులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అని కొందరు అంటుంటే... మరికొందరు ఎప్పటిలాగే అనసూయను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటివి ఈమె నుంచి ఇంకెన్ని చూడాలో అంటూ కామెంట్ చేస్తున్నారు.