Liger: ‘లైగర్’ చేసి తప్పు చేశా.. అనన్యా పాండే షాకింగ్ కామెంట్స్
ABN, First Publish Date - 2023-11-10T20:09:26+05:30
విజయ్‌దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన లైగర్ సినిమా వచ్చిపోయి ఏడాది దాటినా ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాలో కథానాయికగా చేసిన అనన్యాపాండే ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్‌తో ‘లైగర్’ సినిమా పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) , పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన లైగర్ సినిమా వచ్చిపోయి ఏడాది దాటిపోయినా ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎంతో హైప్‌తో 2022 ఆగస్టు 25న పాన్ ఇండియాగా వచ్చిన లైగర్ (Liger) విడుదలైన అన్ని చోట్లా మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుని భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో చిత్ర డిస్టిబ్యూటర్లు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి రోడ్లపై ధర్నాలు కూడా చేశారు. ఇప్పటికీ ఆ సమస్య ఇంకా సమసి పోకున్నా ప్రచారంలో లేదు. పూరీ, విజయ్‌లు మాత్రం వేరే చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
అయితే ఈ సినిమాలో కథానాయికగా చేసిన అనన్యాపాండే (Ananya Panday)కు ఇదే తొలి తెలుగు చిత్రం, పాన్ ఇండియా చిత్రం కూడా. కాగా ఇటీవల ఆమె ‘కాఫీ విత్ కరణ్’ అనే టాక్‌షో సీజన్ 8లో మరో బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్‌తో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా అమ్మడు చేసిన కామెంట్స్‌తో లైగర్ (liger) సినిమా పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
కార్యక్రమంలో ఓ సందర్భంలో లైగర్ (Liger) సినిమాకు సంబంధించిన అంశాలు చర్చకు రాగా అనన్య మాట్లాడుతూ ‘కరణ్ జోహర్, నా తల్లి భావన (Bhavana Panday), తండ్రి చుంకీపాండేల బలవంతంతో’ ఆ సినిమా చేశానని తెలిపింది. ఆ చిత్రం చేయడం నేను చేసిన పెద్ద తప్పని, నా జీవితంలో అంత చెత్త రివ్యూ ఏ సినిమాకు రాలేదని చెప్పుకొచ్చింది.
ఇదిలాఉండగా సినిమాను హిందీలో సమర్పించిన కరణ్ జోహార్ (Karan Johar) మాట్లాడుతూ ఈ సినిమాలో సారా అలీఖాన్ (Sara Ali Khan)ను ఓప్రత్యేక పాట చేయమని కోరామని కానీ ఆమె అంగీకరించలేదనే ఓ సీక్రెట్‌ను బయట పెట్టగా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.