కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Biggboss 7- Amar : సర్‌.. మీ షర్ట్‌ కావాలి.. నాగ్‌ ఏమన్నారంటే

ABN, First Publish Date - 2023-12-12T16:35:12+05:30

బిగ్‌బాస్‌ - 7 ఉల్టాపుల్టా సీజన్  చివరి దశకు చేరింది. గడిచిన ఆదివారం శోభాశెట్టి ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చింది. రాబోయే ఆదివారంతో విన్నర్‌ ఎవరో తేలిపోతుంది. దీంతో ఏడో  సీజన్   పూర్తయినట్టే.

బిగ్‌బాస్‌ - 7 (Biggboss7) ఉల్టాపుల్టా సీజన్  చివరి దశకు చేరింది. గడిచిన ఆదివారం శోభాశెట్టి ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చింది. రాబోయే ఆదివారంతో విన్నర్‌ ఎవరో తేలిపోతుంది. దీంతో ఏడో  సీజన్   పూర్తయినట్టే. శనివారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌ చేసిన తప్పులను ఎత్తి చూపిస్తూ ఫైర్‌ అయిన నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో కూల్‌ అయిపోయి కంటెస్టెంట్స్‌ను, ఆడియన్స్ ను  ఎంటర్‌టైన్  చేశారు. ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున పసుపు రంగు స్వెటర్‌ ధరించి హ్యాండ్సమ్‌గా కనిపించారు.

ఆదివారం ఎపిసోడ్‌లో అమర్‌దీప్‌.. ఆ స్వెటర్‌ తనకి బహుమతిగా ఇవ్వమంటూ నాగార్జునను కోరాడు.  అందుకు నాగార్జున నిరాకరిస్తూ ‘నువ్వు కూర్చో’ అంటూ సీరియస్‌గా సమాదానం ఇచ్చాడు. ఆ వీడియో నెట్టింట వైరల్‌ అయింది. అది చూసిన కొంతమంది నెటిజన్లు ఆ స్వెటర్‌ ధర ఎంత ఉంటుందో అని గూగుల్‌ చేయడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఆ స్వెటర్‌ ధర కనిపెట్టారు. భారత కరెన్సీ ప్రకారం ఆ స్వెటర్‌ ధర రెండు లక్షల పైనే ఉందని తెలిసింది.

Updated Date - 2023-12-12T16:35:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!