కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Allu Ramalingaiah : అల్లు బిజినెస్‌ పార్క్‌లో కాంస్య విగ్రహం!

ABN, First Publish Date - 2023-10-01T17:33:54+05:30

వెయ్యి సినిమాలకు పైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటులు అల్లు రామలింగయ్య. టాలీవుడ్‌లో మూడు తరాల సినీ ప్రేక్షకులను ఆయన అలరించారు. అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని అల్లు ఆవిష్కరించారు.

వెయ్యి సినిమాలకు పైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటులు అల్లు రామలింగయ్య. టాలీవుడ్‌లో మూడు తరాల సినీ ప్రేక్షకులను ఆయన అలరించారు. తనదైన నటనతో యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్‌ ప్రజానీకాన్ని అలరించిన ఆయన 101వ జయంతి నేడు. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్‌లోని అల్లు బిజినెస్‌ పార్క్‌లో పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని అల్లు అరవింద్‌ మనవడు అల్లు అయాన్ (allu ayaan) చేతుల మీదుగా ఆవిష్కరించారు.

అయాన్ మాట్లాడుతూ ‘‘అల్లు రామలింగయ్య (allu Ramalingaiah) తాతగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆయన మనతో లేకపోయినా.. ఆయన మంచి పనులు ఎప్పుడు మనతో ఉంటాయి’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు అల్లు రామలింగయ్యగారితో ఉన్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Updated Date - 2023-10-01T17:33:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!