సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Arjun: వైరల్ అవుతున్న అల్లు అర్జున్ కొత్త ఫోటోస్

ABN, First Publish Date - 2023-04-20T15:36:49+05:30

అల్లు అర్జున్ కొత్త ఫోటోస్ సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త లుక్ లో అల్లు అర్జున్ ఇంకా స్టైలిష్ గా కనపడుతున్నాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు అర్జున్ (Allu Arjun) పేరు మళ్ళీ వైరల్ అవుతోంది. 'పుష్ప 2' (Pushpa 2) షూటింగ్ లో బిజీ గా వున్న అల్లు అర్జున్ ఎందుకు వైరల్ అవుతున్నాడు అంటే, అతని కొత్త ఫోటోస్ బయటకి వచ్చాయి. అందుకని. ఐకాన్ స్టార్ (Icon Star) అవకముందు అల్లు అర్జున్ ని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ (Stylish Star) అనే వారు కదా, అందుకే ఈ కొత్త లుక్ లో ఇంకా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్.

విశాఖపట్నం (Visakhapatnam) లో ఒక భారీ యాక్షన్ సీన్ చేసి హైదరాబాద్ (Hyderabad) కి తిరిగి వచ్చిన అల్లు అర్జున్, మధ్యలో గ్యాప్ దొరికితే ఎదో ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు అని తెలిసింది. ఆ ఈవెంట్ కి డిజైనర్ గౌరవ్ గుప్త (Designer Gaurav Gupta) డిజైన్ చేసిన ఐవరీ మెటాలిక్ టక్సేడో (Ivory Metallic Tuxedo) అవుట్ ఫిట్ వేసుకొని వెళ్ళాడు. ఈ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోస్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ అవుట్ ఫిట్ లో అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా, రాయల్ గా కనపడుతున్నాడు. 'పుష్ప 2' షూటింగ్ లో మళ్ళీ పాల్గొనటానికి సమాయత్తం అవుతున్నాడు. ఈ సినిమా కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. సుకుమార్ (Sukumar) దీనికి దర్శకుడు, రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇందులో కథానాయకురాలు. ఈ సినిమా టీజర్ ఒకటి అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు విడుదల చేస్తే, అది చాలా రోజులు ట్రేండింగ్ లో ఉండటమే కాకుండా, ఒక టీజర్ ని అంతలా అంతమంది చూడటం ఇదే ప్రధమం అని కూడా అంటున్నారు.

Updated Date - 2023-04-20T15:36:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!