కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhanu Sri Mehra: బిగ్ బాస్ ఎలా చూస్తున్నారో అర్థం కావడం లేదు.. అల్లు అర్జున్‌ హీరోయిన్‌

ABN, First Publish Date - 2023-10-31T18:54:00+05:30

బిగ్ బాస్ ను జనం ఎలా చూస్తున్నారో, ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదంటూ అల్లు అర్జున్ హీరోయిన్ బానుశ్రీ మెహ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది.

bhanu

బిగ్ బాస్ ను జనం ఎలా చూస్తున్నారో, ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదంటూ అల్లు అర్జున్(allu arjun) హీరోయిన్ బానుశ్రీ మెహ్రా(Bhanu Sri Mehra) సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పుడెప్పుడో 2010లో అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్వకత్వంలో వచ్చిన వరుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఆ చిత్రం భారీ డిజాస్టర్ అవడంతో వెలుగులోకి రాకుండా పోయింది. అప్పట్లోనే ఈ సినిమాలో అమ్మడు హద్దులు దాటి మరి అల్లు అర్జున్ తో చేసిన లాంగ్ లిప్ లాక్ ఓ సెన్షేసనే క్రియేట్ చేసింది. ఆ సీన్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆపై సరైన అవకాశాలు లేక తెరమరుగైంది.

ఇక ఆ తర్వాత నుంచి చిన్నాచితకా తెలుగు సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో నటిస్తూ వస్తుంది. ఈ మధ్య వచ్చిన విజయ్ లియో సినిమాలోను అమ్మడు ఓ చిన్న పాత్ర చేసింది. ఇప్పటివరకు ఈ భామ పది తెలుగు సినిమాలు చేసినప్పటికీ అవి ఆమె కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడ లేదు. పైపెచ్చు ఆ ఆ చిత్రాల పేర్లు కూడా చాలా మందికి తెలియక పోవడం గమనార్హం.

దాంతో ఇక లాభం లేదనుకుందో ఏమో ఈ సుందరి ఫుల్ టైమ్ ట్రావెలర్ గా మారి యూ ట్యూబ్ వీడియోలు చేస్తు కాలక్షేపం చేస్తున్నది. నిత్యం దేశాలు తిరుగుతూ అన్ని ప్రదేశాలను కవర్ చేస్తూ బీచుల్లో ఎంజాయ్ చేస్తూ, సముద్రాల్లో జలకాలుడుతూ, స్పా లలో మసాజులు చేయించుకుంటూ ఆ వీడియోలను యూ ట్యూబ్ లో పోస్టు చేస్తున్నది.


అయితే ఈక్రమంలోనే అమ్మడు బిగ్ బాస్ షో పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బిగ్ బాస్ షో అనేది టైమ్ వేష్ట్ షో అని అసలు జనం ఎలా చూస్తున్నారో, ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఫైర్ అవుతూ తన సోషల్ మీడియా ఎకౌంట్ ఎక్స్ లో ఓ పోస్టు చేసింది. పైగా ప్రతి సంవత్సరం ఆ సీజన్ ఈ సీజన్ అంటూ తీసుకువచ్చి ప్రజల మైండ్ తో ఆడుకుంటున్నారని మండి పడింది. నా ఇన్స్టా ఎకౌంట్ అంతా బిగ్ బాస్ నోటఫికేషన్లు, వీడియోలతోనే నిండి పోతున్నదంటూ వాపోయింది.

Updated Date - 2023-10-31T19:02:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!