సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Allu Arjun: తొలి నటుడిగా రికార్డ్‌

ABN, First Publish Date - 2023-07-24T21:23:41+05:30

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రేజ్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌గా ఎదిగిన ఆయన్ను మలయాళ అభిమానులు మల్లూ అర్జున్‌గా పిలుచుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 21.8 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే ఇటీవల ట్విటర్‌కు పోటీగా కొత్తగా థ్రెడ్స్‌ యాప్‌ను జుకర్‌ బర్గ్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌లోను ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ రికార్డ్‌ సృష్టించాడు.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) క్రేజ్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌గా ఎదిగిన ఆయన్ను మలయాళ అభిమానులు మల్లూ అర్జున్‌గా పిలుచుకుంటారు. ‘పుష్ప’ (Pushpa 2)చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందారు. బయటే కాదు సోషల్‌ మీడియాలోనూ ఆయన ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 21.8 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే ఇటీవల ట్విటర్‌కు పోటీగా కొత్తగా థ్రెడ్స్‌ యాప్‌ను జుకర్‌ బర్గ్‌ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌లోను ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ రికార్డ్‌ సృష్టించాడు. ఇండియాలోనే వన్‌ మిలియన్‌ (1 million followers) ఫాలోవర్స్‌ సొంతం చేసుకున్న తొలి నటుడిగా నిలిచారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘ప్లాట్‌ఫామ్‌ ఏదైనా ఐకాన్‌ స్ట్టార్‌ తర్వాతే ఎవరైనా’ అంటూ కొందరు, ఎక్కడైనా తగ్గేదేలే (Thaggedele) అంటూ పోస్టులు పెడుతున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప-2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2023-07-24T21:47:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!