సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Arjun: ఒక్క ఫొటోతో బన్నీ చెక్‌ పెట్టారా?

ABN, First Publish Date - 2023-04-24T13:37:11+05:30

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ - ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. జూలైలో డెలివరీ డేట్‌ వచ్చిందని ఇప్పటికే ఉపాసన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan)- ఉపాసన (Upasana) దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. జూలైలో డెలివరీ డేట్‌ వచ్చిందని ఇప్పటికే ఉపాసన తెలిపారు. ఇటీవల చరణ్‌-ఉపాసన స్నేహితులు దుబాయ్‌లో బేబీ (Baby Shower) షవర్‌ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే! తర్వాత చిరంజీవి నివాసంలోనూ ఆమె సీమంతం వేడుక జరిగింది. ఈ వేడుకకు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (allu Arjun) హాజరయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్ట్రాగామ్‌లో వెల్డడించారు. ఉపాసనతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ.. చాలా సంతోషంగా ఉంది ప్రియమైన ఉప్సీ అని పేర్కొన్నారు.

అయితే దీంతో మెగా, అల్లు అభిమానులకు ఓ క్లారిటీ వచ్చిందని టాక్‌ నడుస్తోంది. బన్నీ పోస్ట్‌ చేసిన ఒక్క ఫొటోతో ఇరు ఫ్యామిలీల మధ్య విభేదాలున్నాయన్న వదంతులకు చెక్‌ పెట్టినట్లయింది. సీమంతం వేడుకకు ఉపాసన స్నేహితులు, సన్నిహితులతోపాటు టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, మంచులక్ష్మీ తదితరులు హాజరయ్యారు.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 (Pushpa2) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రామ్‌చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) చిత్రం షూటింగ్‌ చేస్తున్నారు. ఇటీవల ఉపాసనతో కలిసి విహారయాత్రకు వెళ్లొచ్చారు. ప్రస్తుతం మూడు నెలలపాటు పూర్తిగా ఉపాసన కోసం సమయం కేటాయించడానికి షూటింగ్‌కి సెలవు పెట్టినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-04-24T13:37:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!