Allu Arjun : ఇందులో ఒక బోల్డ్ విషయం ఉంది!
ABN, First Publish Date - 2023-11-12T10:40:46+05:30
'టీజర్, ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనే ఆసక్తి కలిగించే చిత్రాలు కొన్ని ఉంటాయి. ‘మంగళవారం’ ట్రైలర్ చూశాక నాకు అదే అనుభూతి కలిగింది. సినిమా చూడాలనే ఆసక్తి కలిగించింది. ట్రైలర్ చూసి సుకుమార్ కూడా షాక్ అయ్యాడు. ఇందులో ఒక బోల్డ్ విషయం ఉంది. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అని అల్లు అర్జున్ అన్నారు.
''టీజర్, ట్రైలర్ చూడగానే సినిమా చూడాలనే ఆసక్తి కలిగించే చిత్రాలు కొన్ని ఉంటాయి. ‘మంగళవారం’ (Mangalavaaram) ట్రైలర్ చూశాక నాకు అదే అనుభూతి కలిగింది. సినిమా చూడాలనే ఆసక్తి కలిగించింది. ట్రైలర్ చూసి సుకుమార్ కూడా షాక్ అయ్యాడు. ఇందులో ఒక బోల్డ్ విషయం ఉంది. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అని అల్లు అర్జున్ (Allu arjun) అన్నారు. పాయల్ రాజ్‌పూత్ (payal Rajputh(ప్రధాన పాత్రలో అజయ్ భూపతి (Ajay bhupati) తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘మంగళవారం’. స్వాతి రెడ్డి గునుపాటి, అజయ్, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. నందిత శ్వేత, అజ్మల్, రవీంద్ర విజయ్ ఇతర పాత్రధారులు. ఈ నెల 17న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.
ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ (Allu arjun) మాట్లాడుతూ ‘‘కొద్దిరోజుల క్రితం ఈ సినిమా టీజర్ చూసి చాలా షాక్ అయ్యా. అజయ్ భూపతి నాకిచ్చిన మాట ప్రకారం వందశాతం గర్వించదగ్గ సినిమా చేశాడనిపించింది. నేనే కాదు దర్శకుడు సుకుమార్ కూడా టీజర్ చూసి షాక్ అయ్యాడు. ఇందులో మంచి వైబ్ ఉందనిపించింది. పాయల్‌కు ‘మంగళవారం’ మరో మైలురాయి లాంటి సినిమా అవుతుంది. ఇది నా సొంత సినిమాలాంటిది. నా ఫ్రెండ్ స్వాతి కోసమే ఈ వేడుకకు వచ్చా. పస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ‘పుష్ప2’ చిత్రీకరణ జరుగుతోంది. జాతర ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
పాయల్ రాజ్‌పుత మాట్లాడుతూ "నేను ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతోంది. ఎంతో నిజాయితీగా ప్రతి పాత్రను చేశాను. ప్రేక్షకులు కూడా నన్ను అలాగే ఆదరిస్తున్నారు. ఇప్పుడొస్తున్న ఈ ‘మంగళవారం’ను కూడా చూసి సక్సెస్ చేయండి. బన్నీ ఈ వేడుకకు రావడంతో నా కోరిక నెరవేరినట్టయింది’’ అని అన్నారు.
అజయ్ భూపతి మాట్లాడుతూ ‘‘ఇది హీరోలేని సినిమా అనుకోవద్దు. ఈరోజే ఈ చిత్రం చూశా. ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. ఎవరినీ సీటులో కూర్చోనివ్వదు. పూనకాలు వస్తాయి. అజనీష్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. షాక్ అయ్యే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించని పాయింట్‌ను ఈ చిత్రంలో చెప్పా’’ అని అన్నారు.