Allu Aravind: ఆ రెండు కారణాల వల్ల బన్నీని చూసి గర్విస్తున్నాను
ABN, First Publish Date - 2023-02-20T17:06:08+05:30
టాలీవుడ్‌లోని టాప్ ప్రొడ్యూసర్స్‌లో అల్లు అరవింద్ (Allu Aravind) ఒకరు. గీతా ఆర్ట్స్ అనే సొంత బ్యానర్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్ హౌస్ కూడా ఉంది. ‘గజినీ’, ‘మగధీర’, ‘గీత గోవిందం’ వంటి ఇండస్ట్రీ హిట్‌లకు నిర్మాతగా వ్యవహరించారు.
టాలీవుడ్‌లోని టాప్ ప్రొడ్యూసర్స్‌లో అల్లు అరవింద్ (Allu Aravind) ఒకరు. గీతా ఆర్ట్స్ అనే సొంత బ్యానర్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్ హౌస్ కూడా ఉంది. ‘గజినీ’, ‘మగధీర’, ‘గీత గోవిందం’ వంటి ఇండస్ట్రీ హిట్‌లకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ మధ్యనే ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించారు. ఆయన తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కుమారుడు అల్లు అర్జున్ (Allu Arjun) పాపులారిటీ గురించి మాట్లాడారు. మనవరాలు అల్లు అర్హ (Allu Arha) సినీ రంగ ప్రవేశం గురించి కూడా మనసులోని మాటను పంచుకున్నారు.
‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo), ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise) తర్వాత బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గతంలో ప్రజలు నన్ను గుర్తించి నా వద్దకు వచ్చి మాట్లాడేవారు. నేను నిర్మించిన సినిమాల గురించి మాట్లాడేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. బన్నీ గురించి అడుగుతున్నారు. కొన్ని సార్లయితే కొంత మంది వారి పిల్లలకు నన్ను అల్లు అర్జున్ తండ్రిగా పరిచయం చేస్తున్నారు. అందువల్ల తండ్రిగా నేను గర్విస్తున్నాను. బన్నీని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాననే కారణంతో మరోసారి గర్వపడుతున్నాను. ఇప్పటికి మేం అందరం ఒకే ఇంటిలో నివసిస్తున్నాం. ప్రతి రోజు ఒకరితో మరొకరం మాట్లాడుతున్నాం. అందువల్ల మా మధ్య ఎటువంటి దాపరికాలు లేవు’’ అని అల్లు అరవింద్ తెలిపారు. అల్లు అర్హ సినీ రంగ ప్రవేశం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె ‘శాకుంతలం’ (Shaakuntalam)లో నటించిన సంగతి తెలిసిందే. భరతుడి పాత్రను పోషించింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.