సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

VarunLav: అదే నిజమైతే... వరుణ్‌లవ్‌ల ప్రేమకు ఎనిమిదేళ్లు!

ABN, First Publish Date - 2023-06-10T10:53:14+05:30

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే! ఆమె ఎవరో కాదు లావణ్యా త్రిపాఠీ అని కూడా అభిమానులకు తెలుసు. అయితే ఈ మ్యాటర్‌ను ఇన్‌డైరెక్ట్‌గా అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ముందే చిన్న హింట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో వైరల్‌ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ (Varun tej) ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే! ఆమె ఎవరో కాదు లావణ్యా త్రిపాఠీ (Lavanya Tripati) అని కూడా అభిమానులకు తెలుసు. వీరిద్దరూ కలిసి ‘మిస్టర్‌’ (mister)చిత్రంలో నటించారు. 2016 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ చిత్రం 2017 ఏప్రిల్‌లో విడుదలైంది. ఆ సమయంలోనే వరుణ్‌-లావణ్యల మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. అప్పటి నుంచి ప్రేమలో ఉన్నట్లు, ఎంగేజ్‌మెంట్‌ తర్వాత లావణ్య చేసిన పోస్ట్‌తో నిజమని తెలుస్తోంది.

నిశ్చితార్థం ఫొటో పోస్ట్‌ చేసి ‘2016 - ఫౌండ్‌ మై ఫర్‌ ఎవర్‌’ అని వరుణ్‌తేజ్‌కు ట్యాగ్‌ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య 2016లోనే ప్రేమ మొదలైందని అర్థమవుతోంది. తర్వాత అంతరిక్షం అనే చిత్రంలో కనిపించారు . అయితే వీరిద్దరి నుంచి చిన్న హింట్‌ కూడా రాలేదు. ప్రేమలో ఉన్నారనే గాసిప్‌ తప్ప ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సందర్భాలు లేవు. అయితే ఈ మ్యాటర్‌ను ఇన్‌డైరెక్ట్‌గా అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ముందే చిన్న హింట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో వైరల్‌ అవుతోంది. (Eight years For Varun - Lavanya lovestory)

‘చావు కబురు చల్లగా’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో లావణ్య వేదికపైకి వచ్చిన అందరికీ హాయ్‌ చెప్తుండగా అల్లు అరవింద్‌ ఆమె చేతిలో నుంచి మైక్‌ తీసుకుని ‘ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చి తెలుగు బాగా నేర్చుకుని మాట్లాడేస్తోంది. ఈ అమ్మాయి ఇక్కడే ఓ కుర్రాడి చూసుకుని పెళ్లి చేసుకుని సెటిలైపోతే బాగుంటుంది కదా’ అని కామెంట్‌ చేశాడు. ఆయన మాటలకు లావణ్య సిగ్గుపడుతూ నవ్వేసింది. ఇప్పుడు ఈ వీడియో చూసిన జనాలు. ‘మీరు ముందే చెప్పారు సర్‌, కానీ మేమే క్యాచ్‌ చేయలేకపోయాం’’’ అని కామెంట్లు చేస్తున్నారు.

లావణ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఇచ్చిన సంవత్సరం ప్రకారం వరుణ్‌ -లావణ్యల ప్రేమకు ఎనిమిదేళ్లు అని తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీననిపై నాగబాబు కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘వరుణ్‌ చేసుకోబోయే అమ్మాయి ఎవరనేది తానే చెబుతాడు. పెళ్లి తర్వాత తను వేరేగా ఉంటాడు’’ అని తెలిపారు. శుక్రవారం వరుణ్‌-లావణ్యల నిశ్చితార్థం నాగబాబు ఇంట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగింది, పెళ్లి ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-06-10T12:33:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!