Brahmanandam: బ్రహ్మానందాన్ని ఎవరు కనిపెట్టారు? తొమ్మిదేళ్ల కుర్రాడి చిన్న ప్రశ్న పెద్ద ప్రశంశ
ABN, First Publish Date - 2023-02-01T15:30:10+05:30
తెలుగు సినిమా చరిత్రలో రేలంగి వెంకట్రామయ్య (Relangi Venkatramayya) ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు పొందారు. కేవలం ఒక్క ముఖ కవళికలుతో మాత్రమే నవ్వులు పండించగలడు అని అతనికి అప్పట్లో చాలా పేరు ఉండేది. అతని తరువాత అంతటి పేరు సంపాదించారు బ్రహ్మానందం (Brahmanandam), కేవలం ముఖకవలికలతో ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తగల నటుడు బ్రహ్మానందం.
అందరూ ఆయనని 'హాస్య బ్రహ్మ' అంటారు. అయన తెర మీద కనిపిస్తే చాలు ప్రేక్షకుడి పెదవుల మీదకి చిరునవ్వు అదే పనిగా వచ్చేస్తుంది. తెలుగు సినిమా చరిత్రలో రేలంగి వెంకట్రామయ్య (Relangi Venkatramayya) ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు పొందారు. కేవలం ఒక్క ముఖ కవళికలుతో మాత్రమే నవ్వులు పండించగలడు అని అతనికి అప్పట్లో చాలా పేరు ఉండేది. అతని తరువాత అంతటి పేరు సంపాదించారు బ్రహ్మానందం (Brahmanandam), కేవలం ముఖకవలికలతో ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తగల నటుడు బ్రహ్మానందం. వెయ్యికి పైగా చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ (Guinness Book of World Records) లో చోటు సంపాదించాడు అంటే అతను ఎంత కష్టపడ్డాడు అన్నది తెలుస్తుంది.
అటువంటి బ్రహ్మాండం ఎప్పుడూ చాల సింపుల్ గా కనిపించే మనిషి, ప్రతి ఒక్కరినీ హాయిగా, ఆనందంగా, నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు. బ్రహ్మానందం ఒక్క నటుడే కాదు అతనిలో చాలా లక్షణాలు వున్నాయి. అతను కవి కూడాను. ఒకసారి అన్నారు, తనకు ఎప్పుడయినా ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు అవి కవితల రూపం లో రాస్తూ వుంటాను అని. ఆలా కవితలు ఇప్పటికే చాలా రాసారు. మరి బుక్ గా అన్ని కవితలు వేస్తారా, వెయ్యరో తెలీదు కానీ రాయటం మాత్రం మానరు.
బ్రహ్మానందం లేని తెలుగు సినిమా ఉందా అని ఒకప్పుడు అనుకునేవారు, అంతలా అన్నీ సినిమాల్లోనూ ఉండేవారు అతను. అతని కోసం అగ్ర నటులు కూడా ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో వున్నాయి. రచయితలు బ్రహ్మానందం కోసం వైవిధ్యమయిన పాత్రలు సృష్టించేవారు. 'మన్మధుడు' లో లవంగం, 'రెడీ' లో మేక్ డోనాల్డ్ మూర్తి, 'బాద్ షా' లో పిల్లి పద్మనాభ శర్మ, 'అదుర్స్' లో భట్టి, 'కృష్ణ' లో బాబీ ఒకటేమిటి చాలా పాత్రల్లో గచ్చిబౌలి దివాకర్, బద్దం భాస్కర్, కిల్ బిల్ పండేయ్, సిప్పీ, హల్వా రాజ్, జిలేబి, దువ్వ అబ్బులు ఇలా అంటిలో అయన నవ్వులు పండించినవే.
ఈ ఫిబ్రవరి 1 వ తేదీన బ్రహ్మానందం 67 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker Dhaassyam) తన కొత్త సినిమాలో వుండే ఎనిమిది పాత్రల్లో బ్రహ్మానందం పాత్ర ఒక కీలమయినదిగా చెప్పారు. ఈరోజు సాంఘీక మాధ్యమం లో బ్రహ్మానందం పాత్ర గురించి చెపుతూ అతని పాత్ర పేరు వరదరాజు అని చెప్పారు. 'పేరు వరద, పోసేది పితుకంత' అనే సెటైరికల్ పాత్రలో కనిపిస్తారు బ్రహ్మానందం అని చెప్తున్నారు తరుణ్ భాస్కర్. అలాగే కృష్ణ వంశీ (Krishna Vamsi) దర్శకత్వం లో వస్తున్న 'రంగ మార్తాండ' (Ranga Marthanda) లో కూడా బ్రహ్మానందం ఒక ముఖ్యమయిన పాత్ర పోషిస్తున్నారు.
అలాగే బ్రహ్మానందం స్కెచ్ చిత్రకారుడు కూడానూ. మంచి మంచి బొమ్మలు, ముఖ్యంగా తిరుపతి వేంకటేశ్వర స్వామి ని అత్యద్భుతంగా పెయింట్ చేసుకొని పెట్టుకున్నారు. అలాగే అతని గొప్ప శిల్పి కూడానూ.
ఒకసారి ఒక తొమ్మిదేళ్ల కుర్రాడు తన తండ్రిని 'బ్రహ్మానందాన్ని ఎవరు కనిపెట్టారు నాన్నా' అని అడిగాడు. ఆ తండ్రి బ్రహ్మానందాన్ని కలిసి, 'బ్రహ్మానందాన్ని ఎవరు కనిపెట్టారు అని నా కొడుకు అడిగాడు' అని చెప్పినప్పుడు, బ్రహ్మానందం ఆనందం అంతా ఇంతా కాదు. అప్పుడు అదే విషయాన్నీ అక్కడ వున్న సహ నటులు, సాంకేతిక నిపుణలతో కూడా పంచుకొని ఎంతో ఆనంద పడ్డారు. ఆ పిల్లవాడికి చేరదీసి ఆలింగనం చేసుకొని ముద్దులు పెట్టాడు, ఇది సుమారు 13 సంవత్సరాల క్రితం నాటి మాట. కానీ ఈరోజుకి ఆ పిల్లవాడి గురించి అడుగుతూ వుంటారు, ఎలా వున్నాడు ఆ అబ్బాయి అని. అదీ బ్రహ్మానందం అంటే! ఆ తరువాత ఒక మీడియా సమావేశం లో కూడా ఆ తొమ్మిదేళ్ల కుర్రాడు తన తండ్రిని అడిగిన 'బ్రహ్మానందాన్ని ఎవరు కనిపెట్టారు' అనే విషయమే తనకి వచ్చిన పెద్ద ప్రసంశ అని చెప్తారు వినయంగా బ్రహ్మానందం.
ఇంత వినయ విధేయ సంపన్నుడు బ్రహ్మానందం తనని వెండి తెరకి పరిచయం చేసిన దర్శకుడు జంధ్యాల ని మాత్రం ఎప్పుడూ మరిచిపోలేదు. తనని కనిపెట్టింది అతనే అంటాడు బ్రహ్మానందం వినయంగా. నాదేముంది నన్ను చూసి రచయితలు వైవిధ్యమయిన పాత్రలు రాసారు, వాళ్ళు రాసిన విధంగా నేను చేశాను. అంతే! అందులో నా గొప్పతనం ఏముంది అన్నట్టు అంటారు, కానీ, రచయితలు రాసినా దాన్ని తెర మీద పండించాలి అంటే ఎంత కష్టపడాలి. అన్నిటికంటే నవ్వించటమే కష్టం అని అందరూ అంటారు.
రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్, రోడ్ మీద, ఎయిర్ పోర్ట్ లో గానే, టీవీ లో ఎక్కడయినా బ్రహ్మానందాన్ని చూసాక ఒక్కసారి చిన్న చిరునవ్వు నవ్వకుండా ఎవరూ వుండరు. అదీ కూడా భగవంతుడు ఇచ్చిన వరం అని వినయంగా చెప్పే బ్రహ్మానందానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.