Akkineni Nagarjuna: మొత్తానికి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు, ఇంతకీ ఎవరంటే...
ABN, First Publish Date - 2023-06-01T11:09:06+05:30
అక్కినేని కుటుంబంలోని హీరోలు తెలుగు దర్శకులతో సరైన హిట్స్ రావటం లేదని, అక్కినేని నాగార్జున ఈసారి ఒక మలయాళం దర్శకుడితో పని చెయ్యాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. అతను దర్శకత్వం లో కన్నా, సినిమాటోగ్రఫీ లో బాగా అనుభవము వున్న వ్యక్తి అని తెలిసింది.
అక్కినేని అభిమానులు చాలా నిరాశకు లోనయ్యారు, ఎందుకంటే అక్కినేని హీరోలు అందరికీ సరైన హిట్ సినిమా పడకపోవటమే. అక్కినేని నాగార్జున (AkkineniNagarjuna), నాగ చైతన్య (NagaChaitanya), అఖిల్ అక్కినేని (AkhilAkkineni) ఈ ముగ్గురు సినిమాలు విడుదల అయ్యాయి కానీ, ఒక్క సినిమా కూడా కనీసం నాలుగంటే నాలుగు రోజులు కూడా సరిగ్గా ఆడలేదు. అందుకని ఇప్పుడు అక్కినేని కుటుంబం మంచి కథల ఎంపికలో పడింది అని సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగార్జున, రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ (BezawadaPrasannaKumar) తో ఒక సినిమా చేయాల్సి వుండింది. కానీ ఆ సినిమా ఒక మలయాళం సినిమాకి అనుకరణ అని చెప్పి ఆపేసారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుండి ప్రసన్న కుమార్ తప్పుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు నాగార్జున ఒక కొత్త దర్శకుడుతో పని చేస్తున్నాడు అని తెలిసింది. అయితే అతను పరిశ్రమకి కొత్త కాదు, ఇంతకు ముందు ఒక మలయాళం సినిమాకి దర్శకుడిగా కూడా చేసాడు. కానీ దర్శకత్వం లో కన్నా, సినిమాటోగ్రఫీ లోనే ఎక్కువ అనుభవం వుంది అతనికి. ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారా, శ్యామ్ దత్ (Shamdat). ఈమధ్యనే 'విరూపాక్ష' (Virupaksha) సినిమాకి సినిమాటోగ్రఫేర్ గా పనిచేశాడు. అలాగే ఇంతకు ముందు నాగార్జున, నాని (Nani) నటించిన 'దేవదాసు' (Devadasu) సినిమాకి కూడా అతనే సినిమాటోగ్రాఫర్.
శ్యామ్ దత్ (Shamdat) కి సినిమాటోగ్రఫర్ గా చాలా అనుభవం వుంది. అలాగే మలయాళం, తమిళం తో పాటు చాలా సినిమాలకు పని చేసాడు. 'ఉప్పెన' (Uppena) సినిమాకి కూడా అతనే, అదే కాకుండా చాలా తెలుగు సినిమాలు సినిమాటోగ్రాఫర్ గా చేసాడు. ఆ అనుభవం వుండబాటే నాగార్జున ఈ మలయాళం సినిమాటోగ్రాఫర్ ని తన తెలుగు సినిమాకి దర్శకుడిగా తీసుకున్నట్టుగా తెలిసింది. శ్యామ్ దత్ ఇంతకు ముందు మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి (Mammootty) ని తన మొదటి సినిమాతో దర్శకత్వం చేసాడు. ఇది రెండో సినిమా అవుతుంది, దర్శకుడిగా. అయితే ప్రసన్న కుమార్ కథనే నాగార్జునకి నచ్చిందని, అందుకనే ఆ కథనే తీసుకుంటున్నారని తెలిసింది. చిట్టూరి శ్రీనివాస్ (ChitturiSrinivas) దీనికి నిర్మాత అని అంటున్నారు.